Anniyan Remake: హిందీ రీమేక్ హీరోయిన్ ఫైనల్ చేసిన శంకర్!

ఒకవైపు వరస వివాదాలు వెంటాడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 పూర్తిచేయకుండా మరో సినిమాను ఎలా ఒప్పుకుంటారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా.. అపరిచితుడు సర్వహక్కులు తన వద్దే ఉన్నాయని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లేఖలు రాసినా శంకర్ అవన్నీ లైట్ తీసుకుంటున్నాడు.

Anniyan Remake: హిందీ రీమేక్ హీరోయిన్ ఫైనల్ చేసిన శంకర్!

Anniyan Remake

Anniyan Remake: ఒకవైపు వరస వివాదాలు వెంటాడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియన్-2 పూర్తిచేయకుండా మరో సినిమాను ఎలా ఒప్పుకుంటారని లైకా ప్రొడక్షన్ కోర్టుకెక్కినా.. అపరిచితుడు సర్వహక్కులు తన వద్దే ఉన్నాయని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లేఖలు రాసినా శంకర్ అవన్నీ లైట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే అన్నియన్ హిందీ రీమేక్ కోసం రణవీర్ సింగ్ ను హీరోగా అనౌన్స్ చేసిన శంకర్.. ఇప్పుడు హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రేజీ రీమేక్ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే కియారాతో సంప్రదింపులు జరిపిన శంకర్ శుక్రవారమే అగ్రిమెంట్ కూడా పూర్తిచేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే రణవీర్ తో కియారా నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. మరోవైపు అన్నియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కథ హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రవిచంద్రన్ కథ హక్కులు తన వద్ద ఉన్నాయని దర్శకుడు శంకర్ కు లేఖ రాయగా.. దానికి శంకర్ కూడా ఘాటుగానే సమాధాన లేఖ రాశారు. ఆ వివాదాం అలా కొనసాగుతుండగానే శంకర్ రీమేక్ కోసం హీరోయిన్ ను ఫైనల్ చేయడం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రచయిత సుజాత అన్నియన్ కోసం కథ-మాటలు అందించగా హక్కులు తనకి ఇచ్చారని నిర్మాత వాదిస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయంపై కోర్టుకెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్ ఇండియన్-2 సినిమా పూర్తికాకుండా మరో ప్రాజెక్ట్ టేకప్ చేసే వీలులేదని కోర్టు కెక్కగా ఇప్పుడు నిర్మాత రవిచంద్రన్ కూడా కోర్టుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ వివాదాల కష్టాల నుండి శంకర్ ఎలా బయటపడతాడో.. ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండి పట్టాలెక్కనుందో చూడాల్సి ఉంది.