Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!

ఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు పెరిగాయి. ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంట గదిలో పప్పు దినుసుల నుండి నూనె ధరలు కూడా పైస్థాయిలోనే ఉన్నాయి.

Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!

Cooking Oil Price Hike

Cooking Oil Price Hike: ఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు పెరిగాయి. ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంట గదిలో పప్పు దినుసుల నుండి నూనె ధరలు కూడా పైస్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలు సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. కాగా.. సామాన్య ప్రజలకు ఇప్పుడు వీరికి మరో బ్యాడ్ న్యూస్ వచ్చేలా కనిపిస్తుంది. వంట నూనె ధరలు మరింత పైకి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇండోనేషియా తీసుకున్న నిర్ణయమే.

Cooking Oil Prices : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు

ఇండోనేషియా ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధించనుందని ఆ దేశాధ్యక్షులు ప్రకటించారు. పామాయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే వంట నూనె కొరతను ఇండోనేషియా ఎదుర్కుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశాల్లో ఇండోనేషియా మొదటిది. పామాయిల్ ఎగుమతుల్లో కీలక దేశమైన ఇండోనేషియా పామాయిల్ ఎగుమతుల్ని నిషేధించడంతో ఆ ప్రభావం ఇతర దేశాలపై పడనుంది. మన దేశం కూడా ఇండోనేషియా నుండి భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటుండడంతో ఇప్పుడు దానిపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది.

Crude oil prices : భారీగా త‌గ్గిన ఇందన ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరా తగ్గడంతో దాని ధరలు అమాంతం పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగగా.. ఇప్పుడు పామ్ ఆయిల్ సరఫరాపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. దీంతో దేశంలో వంట నూనె ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పటికే వంట నూనె ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు ఇండోనేసియా నిర్ణయం వల్ల ధరలు మరింత పెరగొచ్చని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు.