Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? డిజైన్ ఎలా ఉంటుందంటే?

Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో త్వరలో రాబోతోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro Series) లుక్ పరంగా ఎలా ఉండనుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే..

Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? డిజైన్ ఎలా ఉంటుందంటే?

Apple iPhone 15 Pro first renders appear online_ Here’s how it may look

Apple iPhone 15 Pro : ప్రపంచ కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి సరికొత్త మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో (Apple iPhone 15 Pro) పేరుతో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఐఫోన్ 15 ప్రో లాంచ్ అయ్యేందుకు మరో నెలరోజులు మాత్రమే సమయం ఉంది. కానీ, రాబోయే ఈ ఫోన్ ఫీచరర్లకు సంబంధించి అనేక నివేదికలు రివీల్ చేస్తున్నాయి.

(9to5Mac) నివేదిక ప్రకారం.. ఆపిల (iPhone 15 Pro) CAD రెండర్‌లు లీక్ అయ్యాయి. ఐఫోన్ 15 ప్రో రౌండ్ కార్నర్లతో టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుత ఐఫోన్‌లు చాలా మంది వినియోగదారులు షార్ప్ ఎడ్జ్ ఉన్నాయని కంప్లయింట్ చేశారు. ఐఫోన్ 15 ప్రోలో రౌండ్ కార్నర్ ఎడ్జ్ పెద్దదిగా ఉండనుంది. కెమెరా సెన్సార్ల విషయానికి వస్తే.. ఆపిల్ iPhone 15 Proలో కెమెరా సైజు కూడా పెద్దగా ఉండవచ్చు.

Read Also : iPhone 14 Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై అదిరే సేల్.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

లీకైన CAD ఫొటోల ప్రకారం, రాబోయే ఐఫోన్‌లో పర్సనల్ లెన్స్ ప్రోట్రూషన్ రెట్టింపు కానుంది. తద్వారా కెమెరా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. డివైజ్‌లో కెమెరా ఫీచర్స్ మరిన్ని అప్‌డేట్‌లతో రానుంది. ఆపిల్ మరింత లైటింగ్ కనెక్టివిటీతో రానుంది. సెట్టింగ్‌లలో ఎక్స్‌పోజర్ లేదా అండర్ ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుందని సరికొత్త సెన్సార్ టెక్నాలజీతో రానుందని నివేదిక తెలిపింది.

Apple iPhone 15 Pro first renders appear online_ Here’s how it may look

Apple iPhone 15 Pro first renders appear online : Here’s how it may look

రాబోయే ఐఫోన్ 15 Proలో USB Type-C పోర్ట్ ఉండనుంది. ఇప్పటికే లైటనింగ్ పోర్ట్ స్థానంలో USB-C పోర్ట్ రానుంది. రిబ్బెడ్ షేప్‌లో స్పెషల్ మెటల్ సరౌండ్‌ను కలిగి ఉండనుంది. ఆపిల్ వెరిఫై చేసిన USB-C కేబుల్స్ ఐఫోన్‌లతో మాత్రమే పనిచేస్తాయి. ఆపిల్ iPhone 15 Proతో ఫిజికల్ బటన్‌లను తొలగించనుంది.

ప్రస్తుత పవర్, వాల్యూమ్ బటన్‌లు, మ్యూట్ స్లయిడర్‌ కనిపించవు. రాబోయే ఐఫోన్‌లో హాప్టిక్ మ్యూట్, వాల్యూమ్ బటన్‌లు ఉండవచ్చు. బెజెల్స్ నాచ్ సైజును తగ్గించాలని సూచించింది. 9to5Mac నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 Pro మోడల్ 1.55mm కన్నా సన్నగా ఉండే బెజెల్‌లను కలిగి ఉండవచ్చు.

ముందు.. వెనుక గ్లాస్ రెండూ డివైజ్‌లో టైటానియం ఫ్రేమ్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్.. ప్రస్తుత iPhone 14 Pro కన్నా చిన్నదిగా ఉంటుంది. (Apple iPhone 15 Pro) సరికొత్త డీప్ రెడ్ కలర్ వేరియంట్‌లో వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉన్న డీప్ పర్పుల్ కలర్ మోడల్‌తో పాటుగా సాధారణ వైట్, స్పేస్ బ్లాక్, గోల్డ్‌ కలర్ ఆప్షన్లతో రానుంది.

Read Also : WhatsApp Edit Contacts : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇకపై వాట్సాప్‌లోనే కాంటాక్టులను ఎడిట్ చేయొచ్చు..!