Apple iOS 15 Update : ఐఫోన్లలో కొత్త iOS అప్‌డేట్.. ఈ 5 కొత్త ఫీచర్లు ఉంటాయట!

ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి కొత్త ఐఓఎస్ (iOS 15) అప్ డేట్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది.

Apple iOS 15 Update : ఐఫోన్లలో కొత్త iOS అప్‌డేట్.. ఈ 5 కొత్త ఫీచర్లు ఉంటాయట!

Apple Is Adding These New Features In Upcoming Ios 15 Update

Apple Upcoming iOS 15 Update : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి కొత్త ఐఓఎస్ (iOS 15) అప్ డేట్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు ఐఓఎస్ 15 అప్ డేట్ అందుబాటులోకి రానుంది. గత జూన్ లోనే కంపెనీ వర్చువల్ Worldwide Developers Conference (WWDC) 2021 కార్యక్రమం సందర్భంగా ఆపిల్ ఐఫోన్ ఐఓఎస్ 15 అప్ డేట్ గురించి ప్రకటన చేసింది. ఈ కొత్త అప్ డేట్ తో పాటు మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా రిలీజ్ చేయనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఆపిల్ డెవలపర్ బీటా వెర్షన్ లాంచ్ చేసింది. ఈ సిస్టమ్ అప్ డేట్ (iOS 15) ను ఆపిల్ iPhone 13 లాంచ్ చేసే సమయంలోనే రిలీజ్ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ iOS 15 అప్ డేట్ లో మొత్తం 5 ఫీచర్లు రానున్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

1. FaceTime update :
ఆపిల్ iOS 15 లో వీడియో కాలింగ్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసింది. Zoom ఆదర్శంగా FaceTime అనే కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. ఐఫోన్ యూజర్లు ఈ వీడియో కాల్ గిర్డ్ వ్యూలో యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో FaceTime లింక్స్ కూడా యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆ లింకులను షేర్ చేసే ఆప్షన్ కూడా ఉంది. వీడియో చాట్ లోకి ఇతర యూజర్లను ఇన్వైట్ చేసుకోవచ్చు. Google Chrome లేదా Microsoft’s Edge browser ద్వారా ఈ లింకులతో వీడియో కాల్స్ లో జాయిన్ కావొచ్చు. ఆపిల్ డివైజ్ లేకపోయినా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఆపిల్ అందించే వీడియో కాల్స్ end-to-end encrypted సెక్యూరిటీ అందించనుంది. iPhone camera లో పొర్ట్రట్రేయిట్ మోడ్ ద్వారా వీడియో కాల్ ఆప్షన్ అందుకోవచ్చు. FaceTime లో ఈ కెమెరా ఫీచర్ ద్వారా బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ సౌండ్ క్వాలిటీ కూడా వినసొంపుగా ఉంటుంది.

2. SharePlay :
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్లతో స్నేహితులు, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందరికి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నామనే ఫీల్ కలిగేలా ఆపిల్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. అదే.. SharePlay.. దీని ద్వారా సులభంగా movies, music, screen లను FaceTimingతో ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు.

3. Apple Maps :
ఆపిల్ డివైజ్ యూజర్లు ఇప్పటినుంచి వైడ్ రేంజ్ వ్యూ ఎలివేషన్ డేటాతో పాటు elevation data, road colors, driving directions, 3D landmarks వీక్షించవచ్చు. నైట్ మోడ్ కూడా ఇంప్రూవ్ చేసింది. iPhone, Apple Watch Devices దగ్గరలో ఉండే పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ స్టేషన్ల వివరాలను యూజర్లు Pin చేసుకోవచ్చు. స్టాప్ చేరుకోగానే వెంటనే ఆటోమాటిక్ గా అప్ డేట్స్, నోటిఫికేషన్లు పొందవచ్చు. అంతేకాదు. ఆపిల్ మ్యాప్స్ లో augmented reality feature కూడా ఆపిల్ యాడ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వరా iPhone Camera సాయంతో దగ్గరలోని ఏదైనా భవనాన్ని స్కాన్ చేయొచ్చు.

4. Notification bar :
iOS 15 అప్ డేట్ కొత్త మేనేజింగ్ ఫీచర్ తో వస్తోంది. అదే.. నోటిఫికేషన్ బార్.. యూజర్లు సులభంగా Notification Summary functionను అవసరానికి తగినట్టుగా ఎంచుకోవచ్చు. రోజులో ప్రత్యేక సమయాల్లో ముఖ్యం కానీ అలర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఆన్ డివైజ్ మిషన్ లెర్నింగ్ ద్వారా గైడ్ చేస్తుంది. మీ ఫోన్ లో వాడే ప్యాటర్న్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఏయే నోటిఫికేషన్లు సమ్మరీలో వెళ్లాలో ఎంచుకోవచ్చు. ఎప్పుడు డెలివరీ కావాలో కూడా ఎంచుకోవచ్చు. అయితే Missed calls, messages మాత్రం ఈ కేటగిరీలోకి రావు.

5. iMessage :
iOS 15 అప్ డేట్.. iMessage feature ను అప్ గ్రేడ్ తో తీసుకొస్తోంది. ఇందులో కాంటాక్టు ద్వారా షేర్ చేసిన news articles, pictures, playlists అన్నీ Shared with You అనే ఫోల్డర్ తో కలిసి ఉంటాయి.