Temperatures : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏప్రిల్‌లో 122 ఏళ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు

ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఏప్రిల్‌లో 122 ఏళ్ల తర్వాత అంతటి వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.

Temperatures : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏప్రిల్‌లో 122 ఏళ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు

Sunny

highest temperatures : దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో సమ్మర్‌ హీట్‌తో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఈ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సారి అంతకుమించి ఉండనున్నాయని హెచ్చరించింది.

ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఏప్రిల్‌లో 122 ఏళ్ల తర్వాత అంతటి వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ లో సగటు ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉండటం 122 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. అంతకముందు 1973, 2010, 2016లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలు ఉంటున్నాయి.

Hyderabad : హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న ఎండలు.. మరో ఐదు రోజులు

ఏప్రిల్ లో ఉత్తరాదిన 40 డిగ్రీలు, వాయువ్య భారత్ లో 35.90 డిగ్రీలు, మధ్య భారత్ లో 37.78 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హరియాణా, పంజాబ్, చండీగడ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి మేలోనూ కొనసాగుతుందని హెచ్చరించింది. రాత్రుళ్లు సైతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

నైరుతి రుతుపవనాల ముందస్తు అంచనాలను వాతావరణ శాఖ తెలిపింది. వానాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని హెచ్చరించింది ఐఎండీ. ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పారు.

Roti Fried: దేశంలో ఎండలు ఎలా ఉన్నాయంటే: ఎండలో కారు బోనెట్ పైనే రోటి కాల్చుకున్న మహిళ

ఇక తెలంగాణలో ఇప్పటికే వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పగటి వేళ 47 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉండనుందని వివరించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల్‌, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది వాతావరణశాఖ.ఇక ఏపీలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు జనాన్ని వణికిస్తున్నాయి. 100 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 571 మండలాల్లో ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుందని సూచించింది.