Huzurabad Bypoll Results : హుజూరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి

కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Huzurabad Bypoll Results : హుజూరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి

Huzurabad Votes Counting

Huzurabad Bypoll Results :  కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రెండు కౌంటింగ్ హాల్స్ లో 22 రౌండ్స్ లో ఓట్ల ను లెక్కించనున్నారు. కౌంటింగ్ డ్యూటీకి, హాల్‌కు వచ్చే ఇతరులకు శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహంచనున్నారు. గెలిచిన అభ్యర్దులు విజయోత్సవ ర్యాలీలు చేయటానికి అనుమతి లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది.

కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. కాలేజీలో ఏర్పాటు చేసిన రెండు కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో హాలులో ఏడు చొప్పున మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మండలాల వారీగా 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 7 గంటలకే స్ట్రాంగ్ రూమ్ లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ని లెక్కిస్తారు. తర్వాత 22 రౌండ్స్‌లలో ఓట్ల‌ని లెక్కించనున్నారు. రౌండ్,రౌండ్‌కి ఫలితాలను అధికారులు వెల్లడిస్తారని ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ తెలిపారు. రెండు హాల్స్ ను పూర్తిగా సానిటిజ్ చేశామన్నారు. కౌంటింగ్ సందర్భంగా డ్యూటీకి వచ్చే ఉద్యోగులకు, ఇతరులకు, హాల్ కు వచ్చే వారికి శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహంచనున్నట్లు తెలిపారు.

ఎన్నికల పలితాలు వచ్చాక గెలిచిన అభ్యర్ధులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించటానికి అనుమతి లేదని శశాంక్ గోయల్ తెలిపారు. గెలిచిన వారి వెంట ఇద్దరికి మాత్రం వెళ్లటానికి అనుమతి ఉంటుందని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈచర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్ ఎన్నికల అనంతరం వీ.వీ.ప్యాట్ తారుమారు అయ్యిందనే వీడియో పై విచారణ చేశామని…. పని చేయని వీ.వీ. ప్యాట్‌ను వాహనంలో తరలించామని కలెక్టర్ వివరణ ఇచ్చారని శశాంక్ గోయల్ తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎస్ఆర్ ఆర్ కాలేజీ వద్ద మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 14 మంది సీఐలు, 41మంది ఎస్ఐలు, 500మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. వీరికి అదనంగా కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్ ఫోర్స్ ను కూడా మోహరించి ఉంచారు. కౌంటింగ్ కేంద్రం లోపల, ఎస్ఆర్ఆర్ కాలేజీ పరిసర ప్రాంతాలు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుజరగకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లండించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Also Read : Maoists Surrender : పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

ఇదిలా ఉండగా  కేంద్ర ఎన్నికల సంఘం 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 9 న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 29న పోలింగ్, కౌంటింగ్ జరుగుతుందనీ శశాంక్ గోయల్ తెలిపారు. అదే రోజు ఈ ఆరు ఎమ్మెల్సీ ల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్.ఓ. గా అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరీ వ్యవహరిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. రాజకీయ పార్టీలు కొన్ని అభ్యంతరాలు, సూచనలు చేసాయన్నారు. చనిపోయిన వారి ఓటును తొలగించాలని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు శశాంక్ గోయల్. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని శశాంక్ గోయల్ కోరారు.