Maoists Surrender : పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

చత్తీస్‌ఘడ్‌లో  14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఎదుట వారు నిన్న లొంగిపోయారు.

Maoists Surrender : పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

Maoists Surrender

Maoists Surrender :  చత్తీస్‌ఘడ్‌లో  14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఎదుట వారు నిన్న లొంగిపోయారు. నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిన కుటుంబాలకు వెళ్లి వారిని తిరిగి  జనజీవన   స్రవంతిలోకి రమ్మని చేసిన ప్రచారంతో   ఇప్పటి వరకు 454 మంది ఉద్యమాన్ని వదిలేసి పోలీసులకు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.  లొంగిపోయిన వారిలో 117 మందిపై రివార్డు ఉందని ఆయన చెప్పారు.

Also Read : Wife Extra Marital Affair : భార్యపై అనుమానం.. కూతుర్ని హత్య చేసిన తండ్రి

ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు  ఎల్‌ఓఎస్‌, మిలిషియా సభ్యులుగా పనిచేసినట్లు తెలిపారు.  వీరికి పునరావాసం క్రింద తక్షణం పదివేల రూపాయల చెక్‌ను ఎస్పీ అందజేశారు. వీరంతా 2017 లో జరిగిన భద్రతా దళాలను చంపిన కేసులో నిందితులు అని ఎస్పీ వివరించారు.

లొంగిపోయిన వారిలో సన్నా మార్కం అనే మావోయిస్టుపై లక్ష రూపాయలు రివార్డు ఉంది. మిగిలిన మిలీషియా సభ్యులు రోడ్లను ధ్వంసం చేయటం, రోడ్డులో పేలుడు పదార్ధాలను అమర్చటం… మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు అంటించటం వంటి కార్యకలాపాల్లో పాల్గోన్నారు. దంతేవాడ పోలీసులు పలు గ్రామాల్లో 1600 మంది నక్సల్స్ గురించి పోస్టర్లు వేసి వారిపై ఉన్న రివార్డులను ప్రకటించటంతో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు పోలీసులు తెలిపారు.