Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ..తాము చదువుకునే రోజుల్లో తమ తరగతి గదిలో ఒక్క అమ్మాయి కూడా లేదని అన్నారు

Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

Nitish

Bihar CM Nitish: తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటే ఆ సందడే వేరు. కో ఎడ్యుకేషన్ కళాశాలలో ఏరికోరి చదువుతుంటారు విద్యార్థులు. ప్రస్తుతం దాదాపు అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు కో ఎడ్యుకేషన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే పరిస్థితుల ప్రభావం, సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు కారణంగా గతంలో అమ్మాయిలు అంతగా కళాశాలలకు వచ్చేచారు కాదు. ఇదే విషయపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ..తాము చదువుకునే రోజుల్లో తమ తరగతి గదిలో ఒక్క అమ్మాయి కూడా లేదని అన్నారు. సోమవారం పాట్నాలోని మగద్ మహిళా కళాశాలలో 504 పడకల మహిళా హాస్టల్ ప్రారంభోత్సవం అనంతరం నితీశ్ కుమార్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తాను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో..తమ తరగతిలో ఒక్క మహిళా విద్యార్థి కూడా ఉండేది కాదని..ఎంతో బాధగా ఉండేదని సీఎం నితీశ్ అన్నారు. ఎపుడైనా ఒక్క అమ్మాయి తమ తరగతి గది వైపు వస్తే..అబ్బాయిలందరూ గుమిగూడి ఆ యువతిని చూసేందుకు ఎగబడేవారని అన్నారు.

Other Stories:Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్

అప్పట్లో పరిస్థితి ఇలా ఉండేదని..ఇప్పుడు బాలికలు సైతం చదువుల్లో ఎంతో ముందున్నారని సీఎం నితీశ్ అన్నారు. మహిళల చదువు, సమాజంలో వారి పట్ల ఉన్న చిన్నచూపు వంటి వివరాలపై అప్పటి – ఇప్పటి పరిస్థితులను వివరిస్తూ సీఎం నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాలికల కోసం విద్యాసంస్థల్లో సీట్లు రిజర్వ్ చేసామని, తద్వారా మహిళలు సాంకేతిక విద్యను ఎంచుకుని డాక్టర్లు మరియు ఇంజనీర్లు అవుతారని సీఎం అనాన్రు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించి, ఉన్నత స్థాయి అధికారులుగా తీర్చి దిద్దడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది, ”అని సీఎం నితీశ్ కుమార్ చెప్పారు.