Allergies : శీతాకాలంలో అలర్జీలకు దూరంగా… ఆరోగ్యంగా…

తరచుగా దిండ్లూ, పరుపులనూ ఎండలో ఆరేస్తూ ఉంటే డస్ట్‌మైట్స్‌ నాశనమవుతాయి. పార్థీనియం అనే అలర్జీ కారక మొక్క మీ పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసుకోవాలి. కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసేయాలి.

Allergies : శీతాకాలంలో అలర్జీలకు దూరంగా… ఆరోగ్యంగా…

Allergy

Allergies : శీతాకాలం వస్తుందంటే చాల మంది వెన్నులో వణుకు మొదలవుతుంది. ఈ కాలంలో వచ్చే అలర్జీల కారణంగా అనారోగ్య సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుందన్న భయం వారిని వేధిస్తుంది. దంటే చాలు తుమ్ములు, దగ్గులే కాకుండా ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. శీతాకాలంలో ఏదో ఒక అలర్జీ సమస్య వేధిస్తుంది. ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలోని ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, కొన్నిరకాల వాసనలు, చల్లటి వాతావరణం..ఇలాంటి వాటి వల్ల చాలా మంది అలర్జీలకు గురవుతుంటారు. అలెర్జీ కేసులు శీతాకాలంలో 70 శాతం వరకు పెరుగుతాయి. శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలర్జీని నివారించుకోవచ్చు.

శీతాకాలంలో శరీరం అతి తక్కువ ఉష్ణోగ్రతకు గురిఅవుతుంది .శరీరం మొత్తాన్ని కవర్ అయ్యేలా వెచ్చగా కప్పి ఉంచుకోవాలి.ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి. వింటర్లో రూమ్ మీటర్స్, హుమిడిఫైయర్స్ ను ఉపయోగించుకోవాలి.గదులను హాట్ గా, వేడిగా ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు . దాంతో వివిధ రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌ చేరకుండా ఉండేందుకు మ్యాట్రస్‌, కార్పెట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. శీతాకాలం పూర్తయ్యేంత వరకు పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి.

దుమ్మును తుడిచేందుకు పొడి వస్త్రానికి బదులుగా తడి వస్త్రాన్ని ఉపయోగించాలి. వేసవికాలం కంటే చలికాలంలో బ్యాక్టీరియ, వైరస్ చేరే అవకాశం ఎక్కువ కనుకు మ్యాట్రస్ మరియు కార్పెట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. ఎన్‌-95 లేదా ఎఫ్‌ఎఫ్‌పీ2 మాస్క్ ను విధిగా వాడటం అలవాటు చేసుకోవాలి. చలిలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్‌ వంటివి కట్టుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఏ ఆహారం వల్ల అలర్జీ తలెత్తినా దాన్ని తినడాన్ని జీవితాంతం మానేయాలి. ఏదైనా డ్రగ్‌ వల్ల అలర్జీకి గురైనా దానికి జీవితాంతం దూరంగా ఉండాలి.

తరచుగా దిండ్లూ, పరుపులనూ ఎండలో ఆరేస్తూ ఉంటే డస్ట్‌మైట్స్‌ నాశనమవుతాయి. పార్థీనియం అనే అలర్జీ కారక మొక్క మీ పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసుకోవాలి. కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసేయాలి. పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయపు వేళల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండడం అవసరం.

ముక్కు కారడం, కళ్లలో నీరు కారడం వంటి అలర్జీ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళటం మంచిది. అలా కాకుండా సొంతగా ఇంటి వద్దే చికిత్స పొందటం అనేది ఏమంత శ్రేయస్కరం కాదు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటే అలర్జీని అదుపు చేయొచ్చు. అందువల్ల అలర్జీల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. అపరిశుభ్రత ఉన్న చోట సూక్ష్మజీవుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దృష్టంతా వాటిమీదే ఉంటుంది. కాబట్టి అప్రమత్తత పాటించటం ఉత్తమం.