Balakrishna : భయం మా బయోడేటాలోనే లేదు.. NBK 107 టీజర్ రిలీజ్..

జూన్ 10న బాలయ్యబాబు పుట్టిన రోజు కావడంతో తాజాగా NBK 107 టీజర్ ని రిలీజ్ చేశారు. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్, నరకడం మొదలుపెడితే..............

Balakrishna : భయం మా బయోడేటాలోనే లేదు.. NBK 107 టీజర్ రిలీజ్..

Nbk 107

NBK 107 :  నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా సక్సెస్ తర్వాత మంచి ఊపులో ఉన్నారు. అదే ఊపులో మరో మాస్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల కొన్ని షూట్ ఫోటోలని పోస్ట్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

జూన్ 10న బాలయ్యబాబు పుట్టిన రోజు కావడంతో తాజాగా NBK 107 టీజర్ ని రిలీజ్ చేశారు. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలీదు, భయం మా బయోడేటాలో లేదు…. లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ఫుల్ మాస్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ టీజర్ తో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Ante Sundaraniki : నాని భార్యతో కలిసి స్టెప్పులేసిన నజ్రియా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నాని..

అయితే ఇంకా ఈ సినిమాకి టైటిల్ పెట్టలేదు. టైటిల్ లేకుండానే NBK 107 పేరుతోనే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అభిమానులతో పాటు, ప్రేక్షకులని కూడా బాగా నచ్చింది. బాలయ్య బాబు లుక్ ఇందులో అదిరిపోయింది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ లో నటిస్తుండగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.