Namma Metro : ఉదయం 5 నుంచి మెట్రో రైలు సేవలు… ఎక్కడంటే….

కర్ణాటక రాజధాని బెంగుళూరులో  మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి.  ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈరోజు నుంచి కొత్త సమయాలు అమ

Namma Metro : ఉదయం 5 నుంచి మెట్రో రైలు సేవలు… ఎక్కడంటే….

Bengaluru Metro Train Timings

Namma Metro :  కర్ణాటక రాజధాని బెంగుళూరులో  మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి.  ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈరోజు నుంచి కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి.

సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తాయని బెంగుళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) వెల్లడించింది. ఆదివారం మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని ఇందులో ఎటువంటి మార్పులేదనవి బీఎంఆర్సీఎల్ తెలిపింది.

నాగసంద్ర, సిల్కుబోర్డు, కింగేరి, బయ్యప్పనహళ్లి స్టేషన్‌ల నుంచి తొలి మెట్రో రైలు ప్రయాణం ఉదయం 5 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు తిరుగుతూ ఉంటాయి.  బెంగళూరు కెంపెగౌడ రైల్వేస్టేషన్‌ నుంచి మాత్రం చివరి రైలు సర్వీసు రాత్రి 11-30 గంటలకు ఉంటుంది. ప్రజల నుంచివస్తున్న పలువిజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేసినట్లు బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్ తెలిపారు.
Also Read : Nizamabad : నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్ధత
గత కొన్ని నెలలుగా మెట్రోలో ప్రయాణించే వారిసంఖ్య క్రమేపి పెరుగుతోందని ప్రస్తుతం రోజుకు 3 లక్షల మందిని వివిధ గమ్య స్ధానాలకు చేరుస్తున్నామని ఆయన తెలిపారు. రైళ్ల సంఖ్యను పెంచటం వల్ల కూడా  రానున్నరోజుల్లో మరింత మంది ప్రయాణికులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.   కోవిడ్ కు ముందు బెంగుళూరు  మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణించేవారు.  క్రమేపి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ  ఇంకా చాలా మంది ఉద్యోగులు ఇంటివద్దనుంచే పని చేయటం వలన ప్రయాణికుల సంఖ్య jపూర్వపు సంఖ్యకు  పెరగలేదని ఆయన తెలిపారు.