Auto Credit: పబ్లిక్ హాలిడేస్.. సెలవులతో సంబంధం లేకుండా ఒకటో తేదీనే జీతాలు

పబ్లిక్ హాలిడేస్, పండుగ సెలవులు లాంటి అంశాలేమీ ఇకపై జీతాలు ఆలస్యంగా రావడానికి కారణం కావు. ఆగష్టు 1 నుంచి శాలరీ, పెన్షన్, సేవింగ్స్ పై వడ్డీ, డివిడెంట్లు ఇతర పెట్టుబడులు పేమెంట్లు అన్నింటికీ ఒకటే సొల్యూషన్ ....

Auto Credit: పబ్లిక్ హాలిడేస్.. సెలవులతో సంబంధం లేకుండా ఒకటో తేదీనే జీతాలు

Bank Holidays

Auto Credit: పబ్లిక్ హాలిడేస్, పండుగ సెలవులు లాంటి అంశాలేమీ ఇకపై జీతాలు ఆలస్యంగా రావడానికి కారణం కావు. ఆగష్టు 1 నుంచి శాలరీ, పెన్షన్, సేవింగ్స్ పై వడ్డీ, డివిడెంట్లు ఇతర పెట్టుబడులు పేమెంట్లు అన్నింటికీ ఒకటే సొల్యూషన్ దొరికింది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్). బ్యాంకు హాలీడేస్ రోజు కూడా అందుబాటులో ఉంటుంది.

ఎన్పీసీఐ ఆపరేట్ చేసే ఎన్ఏసీహెచ్ సిస్టమ్ కారణంగా ఒక దాని నుంచి చాలా అకౌంట్లకు శాలరీలు, డివిడెంట్, వడ్డీ లాంటి అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రిసీటీ, గ్యాస్, టెలిఫోన్, వాటర్ పీరియాడిక్ ఇన్ స్టాల్మెంట్లను వాయిదా వేసుకోవడం… లేదంటే దాని కోసం ముందుగానే పేమెంట్లు చేయాల్సిన అవసరం లేదు.

కస్టమర్ కన్వినెన్స్ దృష్టిలో ఉంచుకుని వారానికి 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ప్రస్తుతం ఆర్టీజీఎస్, ఎన్ఏసీహెచ్ తో సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు కొత్త సర్వీసుతో బ్యాంక్ వర్కింగ్ డేస్ తో పాటు వారంలో ఏడు రోజులు పనిచేయనున్నట్లు ఆర్బీఐ స్టేట్మెంట్లో వెల్లడించింది.

గతంలో శాలరీలు వేసేందుకు డబ్బు మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసినా.. ఉద్యోగస్తుల అకౌంట్లలోకి ట్రాన్సఫర్ అయ్యేవి. మధ్యలో ఏమైనా పబ్లిక్ హాలిడేస్, పండుగ సెలవులు వస్తే అవి పూర్తవ్వాల్సిందే. కానీ, కొత్తగా వచ్చిన విధానం ద్వారా సంస్థ జమ చేసిన శాలరీలు ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతాయన్నమాట.

సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్(SIPs)లో రిజిష్టర్ చేసుకోవడానికి ఎన్ఏసీహెచ్ సిస్టమ్ వాడతాం. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తవడానికి 2నుంచి 3వారాల సమయం పడుతుంది. ఇన్వెస్టర్ బ్యాంకుపైన ఆ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. చిన్న బ్యాంకులు లేదా జాతీయ బ్యాంకుల ఏవైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియ మరికొద్ది రోజుల్లో చాలా వేగవంతంగా అందుకోనున్నాయి.