Womens Asia Cup 2023: మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌కు భార‌త్ ఏ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. న‌లుగురు తెలుగ‌మ్మాయిల‌కు చోటు

ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త‌-ఏ జ‌ట్టును శుక్ర‌వారం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్ర‌క‌టించింది.

Womens Asia Cup 2023: మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌కు భార‌త్ ఏ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. న‌లుగురు తెలుగ‌మ్మాయిల‌కు చోటు

Women's Asia Cup 2023 squad

Womens Asia Cup: ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023(ACC Emerging Women’s Asia Cup 2023) జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త‌-ఏ జ‌ట్టును శుక్ర‌వారం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) ప్ర‌క‌టించింది. శ్వేతా సెహ్రావ‌త్ నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు ఆడ‌నుంది. 14 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టులో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన న‌లుగురు క్రికెట‌ర్ల‌కు చోటు ద‌క్కింది. గొంగడి త్రిష, మడివాల మమత, ఎస్ యశశ్రీ, బి.అనూష. హైదరాబాద్ కు చెందిన నూషిన్ అల్ ఖాదీర్ హెడ్ కోచ్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

హాంకాంగ్ వేదిక‌గా ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 జ‌ట్లు ఆడ‌నున్నాయి. ఈ ఎనిమిది జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్ ఉంది. టీమ్ఇండియాతో పాటు హంకాంగ్‌, థాయ్‌లాండ్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, మ‌లేషియా, యూఏఈ జ‌ట్లు ఉన్నాయి.

MS Dhoni: ధోని ఫ్యామిలీ ఫోటో.. బ్యాక్ గ్రౌండ్‌ను ఎడిట్ చేయాల‌ని కోరిన అభిమాని.. ఆ త‌రువాత‌

క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ మైదానంలో టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 13న హాంకాంగ్‌తో ఆడ‌నుంది. థాయ్‌లాండ్‌తో జూన్ 15, చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన పాకిస్థాన్‌తో జూన్ 17న త‌ల‌ప‌డ‌నుంది.

ఇండియా ఎమర్జింగ్-ఏ జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిషా గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాలా (వికెట్ కీపర్), యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ డ్రా అయితే ప‌రిస్థితి ఏంటి..? ట్రోఫీని అందుకునేది ఎవ‌రంటే..?