Bhagavad Gita: “భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు.. అందరిదీ”

గుజరాత్ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు భగవద్గీతను స్కూల్ సిలబస్ గా చేర్చినట్లుగానే కర్ణాటక కూడా అదే ప్రణాళిక అమలుచేసే పనిలో పడింది. నిపుణుల అప్రూవల్ ఇటీవలే దక్కిందని..

Bhagavad Gita: “భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు.. అందరిదీ”

Bahagavad Gita

Bhagavad Gita: గుజరాత్ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు భగవద్గీతను స్కూల్ సిలబస్ గా చేర్చినట్లుగానే కర్ణాటక కూడా అదే ప్రణాళిక అమలుచేసే పనిలో పడింది. నిపుణుల అప్రూవల్ ఇటీవలే దక్కిందని విద్యార్థులకు ఈ సిలబస్ చాలా కీలకంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు మాట్లాడిన కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేశ్.. ‘భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు. నిపుణులు సూచిస్తే కచ్చితంగా విద్యార్థుల సిలబస్ లో చేరుస్తాం. కాకపోతే అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతుంది’ అని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ అన్నారు.

‘మనం స్కూల్స్ లో ఉన్నప్పుడు మోరల్ సైన్స్ గురించి చదివాం. ఇప్పుడు అదే పిల్లలకు తెలియాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆలోచనలేదు. భవిష్యత్ లో ఇంట్రడ్యూస్ చేస్తాం. మోరల్ సైన్స్ గురించి నిపుణుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Read Also : బడిలో భగవద్గీత.. గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం

‘ముఖ్యమంత్రితో మోరల్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అని మాట్లాడాం. పిల్లలపై సత్ప్రభావం చూపించేది ఏదైనా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అది భగవద్గీతైనా, రామాయణమైనా, మహాభారతమైనా అని వ్యాఖ్యానించారు.