NBK 107: బాలయ్య కోసం భావన తెలుగులో రీ ఎంట్రీ?

నందమూరి బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తూనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా అడుగుపెట్టిన బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాని తెరమీదకి తెచ్చే పనిలో ఉన్నాడు.

NBK 107: బాలయ్య కోసం భావన తెలుగులో రీ ఎంట్రీ?

Nbk 107

NBK 107: నందమూరి బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తూనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా అడుగుపెట్టిన బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాని తెరమీదకి తెచ్చే పనిలో ఉన్నాడు. ఇక, తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి బాలయ్య దృష్టిలో పడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు.

Puneeth Rajukumar: డబ్బింగ్ లేకుండానే పునీత్ చివరి సినిమా విడుదల!

ప్రస్తుతం గోపీచంద్ బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి ఆధారంగా కథ రాసుకున్న గోపీచంద్ ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని ప్లాన్ చేసిన గోపీచంద్ అందుకోసం శృతి హాసన్ ను నయనతార, శృతిహాసన్ లతో సంప్రదింపులు జరిపినట్లు వినిపించింది. ఫైనల్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Akhanda: కొత్త రిలీజ్ డేట్.. బాలయ్య గర్జన ఎప్పుడంటే?

కాగా, ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా భావనను ఎంచుకున్నట్లు వినిపిస్తుంది. తెలుగులో గోపీచంద్ ఒంటరి, నితిన్ హీరో, శ్రీకాంత్ మహాత్మ సినిమాలలో నటించిన భావన చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న భావనను మళ్ళీ బాలయ్య కోసం రీఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.