Deeply Hurt By Own Word : నా మాటలే నన్ను గాయపరుస్తున్నాయి : ఉమాభారతి పశ్చాత్తాపం

ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల చెప్పులు మోయటానికే పనికొస్తారు అని తాను చేసిన వ్యాఖ్యలపై ఉమాభారతి పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. నేను చేసిన వ్యాఖ్యలే నన్నుబాధిస్తున్నాయంటూ విచారించారు

Deeply Hurt By Own Word : నా మాటలే నన్ను గాయపరుస్తున్నాయి : ఉమాభారతి పశ్చాత్తాపం

Umebharathi

Deeply Hurt By Own Word : Uma Bharti  : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రభుత్వ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడ్డారు. కాషాయ వస్త్రాలు ధరించే ఉమాభారతి ఇష్టానురీతిగా మాట్లాడుతుంటారు. ఆ తరువాత ఇకనుంచి అలా మాట్లాడను కంట్రోల్ చేసుకుంటాను అని చెబుతుంటారు.మళ్లీ అదే రీతిగా వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం ‘ప్రభుత్వ అధికారులు మా చెప్పులు మోయటానికి పనికొస్తారు’ అంటూ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో మరోసారి ఉమా భారతి విచారం వ్యక్తంచేశారు.

‘అధికారులపై నేను చేసిన వ్యాఖ్యలు తననే తీవ్రంగా బాధించాయని వాపోయారు. అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు. నా వ్యాఖ్యలు నన్నే గాయపరుస్తున్నాయి అంటూ విచారం వ్యక్తంచేశారామె. అలా మాట్లాడాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలం వాడొద్దని పదేపదే మీకు చెప్పే నేనే అలాంటి పదాలు వాడినందుకు బాధగా ఉందని, ఇకపై తన భాషను మెరుగుపరుచుకుంటానని అన్నారు.

Read more : Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి

కాగా గత శనివారం భోపాల్‌లోని ఆమె నివాసంలో కొందరు ఓబీసీ నేతలు ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా బ్యూరోక్రసీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఉన్నది రాజకీయ నాయకుల చెప్పులు మోయటానికేననీ..ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చేదీ మేమే..వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే…వాళ్లకు ప్రమోషన్ లు, డిమోషన్ లు కూడా మా చేతుల్లోనే ఉంటాయి…వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాల కు మేమే వాళ్ళను వాడుకుంటాం’’అని ఉమాభారతి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

Read more : Muslim Sculptors : ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పలువురు కాంగ్రెస్ నేతలు ఉమాభారతి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేవారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, ఉమాభారతి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ లేఖపై స్పందించిన ఉమా భారతి తిరిగి లేఖ రాశారు.

ఈ లేఖలో ఆమె ఎప్పుటికప్పుడు తాను చాలా సమన్వయంతో మాట్లాడాలని అనుకుంటుంటాననీ..కానీ ఏదోక సందర్భంలో ఇలా మాట్లాడిన మాటలు తననే గాయపరుస్తున్నాయని..నేను అలా మాట్లాడాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలం వాడొద్దని పదేపదే చెప్పే నేనే అలాంటి పదాలు వాడినందుకు బాధగా ఉందని..ఇకపై తన అలా మాట్లాడనని ఉమా భారతి ఆ లేఖలో పేర్కొన్నారు.