BiggBoss : ‘నిన్నే పెళ్లాడతా’లో ‘దాక్కో దాక్కో మేక’.. ఇది బిగ్ బాస్ వర్షన్..

'నిన్నే పెళ్లాడుతా' సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో ఈ వీక్ ఎపిసోడ్ లో స్పెషల్ పర్ఫామెన్స్‌లు కూడా ఉన్నాయి. నిన్నే పెళ్లాడతా సినిమాలోని సాంగ్స్ కి కంటెస్టెంట్స్ డ్యాన్సులు వేశారు.

BiggBoss : ‘నిన్నే పెళ్లాడతా’లో ‘దాక్కో దాక్కో మేక’.. ఇది బిగ్ బాస్ వర్షన్..

Bb

BiggBoss :  తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు 5వ సీజన్ తో నడుస్తుంది. ఈ సీజన్ లో మొదటి నుంచి కూడా ఎక్కువగా గొడవలు, ఏడుపులు, అరుపులే ఉన్నాయి. మధ్య మధ్యలో లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వీక్ ఇంకొకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. తాజాగా ఇవాళ వీకెండ్ స్పెషల్ ప్రోమోలని విడుదల చేశారు.

‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో ఈ వీక్ ఎపిసోడ్ లో స్పెషల్ పర్ఫామెన్స్‌లు కూడా ఉన్నాయి. నిన్నే పెళ్లాడతా సినిమాలోని సాంగ్స్ కి కంటెస్టెంట్స్ డ్యాన్సులు వేశారు. పెయిర్స్ గా కూడా నిన్నేపెళ్లాడతా లోని సాంగ్స్ కి రొమాంటిక్ గా డ్యాన్స్ వేశారు. ఎప్పటిలానే అందగత్తెలతో కలిసి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అలాగే హౌస్ లో ఉన్న వాళ్లందరితో కూడా డ్యాన్సులు వేయించాడు.

Chay Sam Breakup : పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు.. సమంతకి సూక్తులు నేర్పుతున్న చిన్మయి

ఆతర్వాత ‘దాక్కో దాక్కో మేక’ అనే గేమ్ ఆడించాడు నాగార్జున. ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ ని ఇద్దరిద్దరిగా విడతీసి ఒకరు పరిగెడుతుంటే ఇంకొకరు పట్టుకోవాలి అని చెప్పారు. హామీద ని శ్రీరామ్, అనీ మాస్టర్ ను రవి, జెస్సీని శ్వేతా, సన్నీని ప్రియా, షణ్ముఖ్ ను సిరి, విశ్వ నటరాజ్ మాస్టర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉంది కాబట్టి నామినేషన్ లో ఉన్న లోబో, సిరి, అనీ, నటరాజ్ మాస్టర్ లో ఒకరు ఎలిమినేటి అవ్వనున్నారని నాగార్జున చెప్పారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. .