Chay Sam Breakup : సమంతకు క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి మెసేజ్

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోతున్నారని మొన్నటిదాకా రూమర్స్ వినిపించాయి. కానీ నిన్న సాయంత్రం ఆ జంట స్వయంగా మేము విడిపోతున్నాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Chay Sam Breakup : సమంతకు క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి మెసేజ్

Chinmai

Chay Sam Breakup : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోతున్నారని మొన్నటిదాకా రూమర్స్ వినిపించాయి. కానీ నిన్న సాయంత్రం ఆ జంట స్వయంగా మేము విడిపోతున్నాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు డైరెక్ట్ గా సమంత నాగ చైతన్యలని ఉద్దేశించి చెప్తుంటే కొంతమంది ఇండైరెక్ట్ గా పోస్టులు పెడుతున్నారు. ఇదే బాటలో ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సమంత స్నేహితురాలు చిన్మయి కూడా స్పందించింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేశాను : క్రిష్

చై-సామ్ విడాకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పోస్టులని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంట్లో ముఖ్యంగా పెళ్ళికి ప్రేమ ఒక్కటే సరిపోదు ఇంకా చాలా కావాలంటూ ఓ పోస్ట్ ని పెట్టింది. పెళ్లి చేసుకునే ముందు ఇద్దరూ కూర్చొని పెళ్లి అయ్యాక ఏమేమి బిల్స్ కట్టాలి, పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పెంచాలి, ఖర్చులు ఏముంటాయి, అప్పులు అవుతాయా, సంపాదన ఎంత ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుందా, మానసిక ఆరోగ్యం బాగుందా, వాళ్ళ కుటుంబం బాగుందా, డబ్బులు ఉన్నాయా లేవా, మీ పార్ట్నర్ మీ నుంచి ఏమి ఎక్సపెక్ట్ చేస్తున్నారు?, ఇంటి గురించి, కెరీర్ గురించి, పొలిటికల్, డివోషనల్ వ్యూస్ ఎలా ఉన్నాయి, మీ చిన్నతనాల గురించి, చేయబోయే రొమాన్స్ గురించి ఇలా అన్ని మాట్లాడుకొని అన్ని ఓకే అంటే పెళ్లి చేసుకోవాలి అని పోస్ట్ చేసింది.

 

పెళ్లి చేసుకోవాలి అంటే ఇవన్నీ చూడాలి ప్రేమ ఒక్కటే కాదు అని పోస్ట్ చేయడంతో కొంతమంది నెటిజన్లు ఇది కరెక్ట్ అని కామెంట్లు చేయగా, కొంతమంది ఇవన్నీ చూసుకుంటే అది బిజినెస్ డీల్ అవుతుంది కానీ పెళ్లి ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి నుంచి చై-సామ్ విడాకుల వార్త ట్రేండింగ్ లో ఉంది.