Bihar: ధీరేంద్ర శాస్త్రీని జైలులో వేయాలి.. బిహార్ ఆర్జేడీ చీఫ్ వివాదస్పద వ్యాఖ్యలు

మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Bihar: ధీరేంద్ర శాస్త్రీని జైలులో వేయాలి.. బిహార్ ఆర్జేడీ చీఫ్ వివాదస్పద వ్యాఖ్యలు

RJD leader Jagadanand and Dhirendra Shastri

Updated On : April 29, 2023 / 11:59 AM IST

Bihar: మధ్యప్రదేశ్‭కు చెందిన ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రీని జైలులో వేయాలంటూ బిహార్ రాష్ట్రీయ జనతా దళ్ శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ అలాంటి వ్యక్తులు బయట తిరుగుతున్నారని, సంప్రదాయాలను ఇలాంటి వ్యక్తులు మంటగలుపుతున్నారని జగదానంద్ సింగ్ మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఇదే పార్టీకి చెందిన నేత, బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. రామచరితమానస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకమని, ఆ పుస్తకాన్ని తగలబెట్టాలంటూ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. తాజాగా జగదానంద్ చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు వెళ్తాయో చూడాలి.

Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు సైతం ఆయనను కలుస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని నాయకులే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. భాగేశ్వర్ ధాంలో ఉంటున్న ఈ బాబా మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ మధ్య జబల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సాయిబాబా సాధువు మాత్రమేనని, దైవం కాదంటూ ధీరేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Supreme Court: అతీక్‌, అష్రఫ్‭లను ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు? పోలీసులకు సుప్రీం ప్రశ్నలు