Telangana CS Somesh Kumar : సీఎస్ సోమేష్ కుమార్ కేసులపై సీజేఐకి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ పై  నున్న రిట్ పిటిషన్‌ను  వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ

Telangana CS Somesh Kumar : సీఎస్ సోమేష్ కుమార్ కేసులపై సీజేఐకి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే

Somesh kumar, raghunandan rao

Telangana CS Somesh Kumar : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ పై  నున్న రిట్ పిటిషన్‌ను  వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

సోమేష్ కుమార్ పై 2017లో భారత ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఎందుకు ఆగిందో తేల్చాలని ఆయన లేఖలో కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు కేసు రాకుండా ఎవరు తొక్కిపెడ్తున్నారో తేల్చాలని…. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడిన సోమేష్ కుమార్ తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ సీఎస్ పై చర్యలు తీసుకోవాలని రఘునందనరావు జస్టిస్ రమణ కు రాసిన లేఖలో కోరారు.  మంత్రులకే సోమేష్ కుమార్ జవాబు ఇవ్వరని ప్రభుత్వంలో మంత్రులే చెప్తున్నారని ఆయన లేఖలో పేర్కోన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించకుండా.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రఘునందనరావు తెలిపారు.
Also Read : Chhattisgarh : మందుపాతర పేల్చిన మావోయిస్టులు
న్యాయస్థానం ముందు అందరూ సమానమేనని.. సోమేష్ కుమార్‌ని న్యాయస్ధానంలో దోషిగా నిలబెడతామని ఆయన చెప్పారు.  సీఎస్ సోమేష్ కుమార్ పైనున్న 365 కోర్టు ధిక్కరణ కేసులను విచారించాలని ఆయన అన్నారు.   ప్రభుత్వం,  స్పీకర్ కుట్రలో భాగమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్ అని ఆయన అంటూ.. అసెంబ్లీ సస్పెన్షన్ పై మా పోరాటం కొనసాగిస్తాం… న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చెప్పారు.
Also Read : Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త