BJP: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ మరోసారి సిద్ధం
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కీలక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ఆ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు అవుతారు.

Bandi Snajay Kumar
BJP: ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ మరోసారి సిద్ధమవుతోంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కీలక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ఆ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు అవుతారు. ఇవాళ ఉదయం 11 గంటలకు చేరికల సమన్వయ కమిటీ, 12 గంటలకు ఫైనాన్స్ కమిటీ, ఒంటి గంటకు ప్రజా సమస్యలు-టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
జిల్లాల వారీగా చేరికలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. చేరికలను బీజేపీ కీలక నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్‌ను బీజేపీ నియమించింది. ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా జితేందర్ రెడ్డి, ప్రజా సమస్యలు-టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ఎంపీ అర్వింద్ వ్యవహరిస్తున్నారు. పార్టీలో పాత, కొత్త నేతలకు బాధ్యతలు అప్పజెప్పారు. చేరికల ద్వారా టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.