No Confidence Motion: ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోదీ మాట్లాడిన పాత వీడియోను షేర్ చేసిన బీజేపీ

తాజా అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయేట్టుగానే కనిపిస్తోంది. కారణం.. ఎన్డీయేకు మెజారిటీకి మించి ఎంపీలు ఉన్నారు. వాస్తవానికి తాము ఓడిపోతామని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.

No Confidence Motion: ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోదీ మాట్లాడిన పాత వీడియోను షేర్ చేసిన బీజేపీ

Old Video of Modi: గత మూడు రోజులుగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చర్చ సాగుతోంది. మణిపూర్ హింసాకాండను అదుపు చేయడంలో ప్రభుత్వంపై విఫలమైందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాగా, గతంలో విపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ గుర్తు చేసింది. ‘‘ఎవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు. అందరినీ గౌరవిస్తాను’’ అంటూ 2019లో తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయనే ఉద్దేశంలో బీజేపీ ఈ వీడియోను షేర్ చేసింది. ‘‘ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ విషయంలో ఎవరూ అసంతృప్తి చెందవద్దు. అందరికీ గౌరవం దక్కుతుంది. అందరినీ గౌరవిస్తాను’’ అని ఆ వీడియో మోదీ అన్నారు. తాజా అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయేట్టుగానే కనిపిస్తోంది. కారణం.. ఎన్డీయేకు మెజారిటీకి మించి ఎంపీలు ఉన్నారు. వాస్తవానికి తాము ఓడిపోతామని తెలిసి కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అయితే వారి ఉద్దేశం.. ఈ తీర్మానం ద్వారా మోదీని మణిపూర్ అంశంపై చర్చించేలా చేయడం. అయితే మూడు రోజులైనప్పటికీ మోదీ ఇంకా పార్లమెంటుకు రాలేదు. దీనిపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.