Bandi Sanjay Kumar : ఆర్డీఎస్ చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం-బండి సంజయ్ హామీ
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ఈరోజు గద్వాల జోగులాంబ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే టెయిలాండ్ ప్రాంతాల్లో లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
లక్ష ఎకరాలకు నీరందించి అలంపూర్ ను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకుంటానని బండి సంజయ్ అన్నారు. తన ఫాం హౌస్ కు గోదావరి నీళ్లు తెచ్చుకునేందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిన కేసీఆర్ కు ఆర్డీఎస్ ఆధునీకరణకు రూ.70 కోట్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదని ఆరోపించారు. రైతులు సొంతగా లిఫ్టులు పెట్టుకుంటామని కోరినా కేసీఆర్ అనుమతి ఇవ్వటంలేదని ఆయన అన్నారు.
ఎడారిని తలపిస్తున్న అలంపూర కేసీఆర్ కు పచ్చగా కనిపిస్తోందట….సమైక్య పాలనకు మించిన ద్రోహం కేసీఆర్ చేస్తున్నరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. జోగులాంబ అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా…. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ కెనాల్ ద్వారా 15.6 టీఎంసీల నీరు వచ్చేలా చేస్తామని బండి సంజయ్ పేర్కోన్నారు.
Also Read : Rahul Gandhi: దేశంలో 40 లక్షల మంది మృతి చెందారు: కరోనా మరణాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
అలంపూర్లో లక్ష ఎకరాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన చెప్పారు. ఆర్డీఎస్ టెయిలెండ్ ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇస్తున్నా…అవసరమైతే లిఫ్ట్ లు ఏర్పాటు చేసైనా సరే ఈ ప్రాంత ప్రజలకు సాగు నీరందిస్తాం…అందుకోసం ఎంతదాకైనా వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.. అలంపూర్ నియోజకవర్గంలో మిర్చి మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ చెప్పారు.