Leena Maria : మత్తుకళ్లతో మోసం, రూ. 200 కోట్ల భారీ మోసం..బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ అరెస్టు

బ్లాక్‌ బ్యూటీ లీనా మారియా అడ్డంగా బుక్కయ్యింది. మత్తుకళ్లతో మోసం చేసి కోట్లు కొట్టేసిన లీనా మారియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Leena Maria : మత్తుకళ్లతో మోసం, రూ. 200 కోట్ల భారీ మోసం..బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ అరెస్టు

Leena Maria

Black Beauty Leena Maria : బ్లాక్‌ బ్యూటీ లీనా మారియా అడ్డంగా బుక్కయ్యింది. మత్తుకళ్లతో మోసం చేసి కోట్లు కొట్టేసిన లీనా మారియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ. 200 కోట్ల భారీ మోసం కేసులో కిలాడీ లేడీకి బేడీలు వేశారు. సంచలనం సృష్టిస్తున్న రూ. 200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సుకేశ్ ప్రస్తుతం పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు. త్వరలో ఈడీ అతడిపై విచారణకు సిద్ధమవుతోంది.

Read More : Reliance : కొత్త వ్యాపారం.. త్వరలో చీరల దుకాణం

తీహార్ జైలు నుంచే : –
సుకేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అతను జైలులో కూర్చునే ఈ రాకెట్‌ను నడిపించాడు. సుకేశ్, అతని సహచరులపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. లీనా మరియా పాల్‌ను సైతం  అరెస్టు చేశారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో లీనాను అరెస్టు చేశారు. లీనా బాయ్‌ఫ్రెండ్ సుకేశ్ చంద్రశేఖర్ జైలు లోపల నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా ఇద్దరు వ్యాపారవేత్తల కుటుంబాల్ని మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. సుకేశ్ సుమారు 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.

Read More : Skeleton Found In Hospital Lift : 24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్…… అందులో బయటపడిన…….!

కెనరా బ్యాంకును మోసం : –
ఈ కేసులో సుకేశ్‌తో పాటు అతని భార్య, ఇంకా చాలామంది బ్యాంక్ ఉద్యోగులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇటీవల చెన్నైలోని సుకేశ్ బంగ్లాపై ఈడీ దాడి చేసింది. ఆయనకు సంబంధించిన 16 పెద్ద వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు కూడా ఇంట్లో దొరికాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని ఈడీ అధికారులు గుర్తించారు.లీనా మారియాను పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. లీనా, సుఖేష్‌ కలిసి 2013లో కెనరా బ్యాంకును 19కోట్లు మోసం చేశారు.

Read More : Anantapur : కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు

మద్రాస్ కెఫే సినిమాలో నటి : –
అప్పట్లో వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చాక మరింత రెచ్చిపోయిన ఈ జంట… 2015లో అధిక రాబడులు ఇస్తామంటూ జనంతో బోగస్ సంస్థల్లో పెట్టుబడి పెట్టించారు. దీంతో వారిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. ఇంతలో, ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఆధారంగా ED కేసు నమోదు చేసింది. లీనా.. జాన్ అబ్రహంతో కలిసి ‘మద్రాస్ కెఫే సినిమా’లో నటించింది. చాలా బాలీవుడ్ చిత్రాల్లో కన్పించింది.