Aha : ‘ఆహా’ లో జూన్ నెలలో.. అదిరిపోయే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..!

బ్లాక్‌బ‌స్ట‌ర్ కంటెంట్‌తో, అదిరిపోయే సినిమాలతో జూన్ నెలలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది ‘ఆహా’..

Aha : ‘ఆహా’ లో జూన్ నెలలో.. అదిరిపోయే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..!

Blockbuster Movies Coming On Aha In June

Aha: నేరుగా ఇంటికే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తాన‌ని ప్రామిస్ చేసిన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’… ‘క్రాక్‌’, ‘గాలి సంప‌త్‌’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘సుల్తాన్‌’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘థ్యాంక్ యు బ్రదర్’, ‘అనుకోని అతిథి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌తో పాటు వెబ్ షోస్‌, సిరీస్‌, ఒరిజిన‌ల్స్‌తో త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది..
బ్లాక్‌బ‌స్ట‌ర్ కంటెంట్‌తో, అదిరిపోయే సినిమాలతో జూన్ నెలలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది ‘ఆహా’.. వారానికో సినిమా చొప్పున నాలుగు డిఫరెంట్ మూవీస్ ‘ఆహా’ లో ప్రీమియర్ కానున్నాయి.. జూన్ నెలలో రాబోతున్న సినిమాలివే..

‘మనిషిలోని మృగం మేల్కొంటే, నాగరికత కూడా చిన్నబోతుంది. ఇది అలాంటి ఒక కథ!’ అంటూ ‘కాలా’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. టొవినో థామస్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన మలయాళం సినిమా ‘కాలా’ ను అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. జూన్ 4 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది..

Kala

కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఆకట్టుకున్న యువ నటుడు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, డైలాగ్ కింగ్ సాయి కుమార్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అర్ధ శతాబ్దం’.. రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేశారు. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ నిర్మించారు. జూన్ 11 నుండి ‘ఆహా’లో ‘అర్ధ శతాబ్దం’ అందుబాటులోకి రానుంది..

Ardhashathabdam

హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్‌జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది ‘ఆహా’. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.. జూన్ 18న ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్‌జీ) ప్రేక్షకుల ముందుకు రానుంది..

In the Name of God

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘వన్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’. సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది.. ప్రతి శుక్రవారం వారానికో సినిమా చొప్పున రిలీజ్ చేస్తూ తమ సబ్ స్క్రైబర్లకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది తెలుగు ఓటీటీ ‘ఆహా’..

One