Bollywood Movies : బాలీవుడ్ బడా సినిమాలు రిలీజ్‌కు రెడీ..

మొన్నీ మధ్యనే అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మిగిలినవాళ్లు కూడా లైనప్‌కి రెడీ అయ్యారు..

Bollywood Movies : బాలీవుడ్ బడా సినిమాలు రిలీజ్‌కు రెడీ..

Bollywood Movies

Bollywood Movies: కరోనా కాస్త స్లో అవ్వడంతో షూటింగ్స్ స్పీడప్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. వీటితో పాటు సినిమా రిలీజ్‌లకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్నీ మధ్యనే అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మిగిలినవాళ్లు కూడా లైనప్‌కి రెడీ అయ్యారు. మరి ఏ సినిమా ఎప్పుడు థియేటర్లోకొస్తున్నాయో చూద్దాం.

సినిమాల రిలీజ్ విషయంలో సౌత్‌తో పోలిస్తే.. నార్త్ స్లోగానే ఉంది. టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్ని కూడా రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా సినిమాలు రిలీజ్ చేద్దామా, వద్దా అని ఆలోచిస్తోంది. లేటెస్ట్‌గా అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాని జులై 27 న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చెయ్యడంతో బాలీవుడ్‌లో మిగిలిన సినిమాలు కూడా అలర్ట్ అయ్యి రిలీజ్ డేట్స్ వైపు చూస్తున్నాయి.

అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ అనౌన్స్ చెయ్యడంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఈద్‌కి రిలీజ్ కావల్సిన జాన్ అబ్రహం మూవీ ‘సత్యమేవ జయతే 2’ పోస్ట్‌పోన్ అయినా, ‘అటాక్’ మూవీని ఆగస్ట్13 నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు జాన్ అబ్రహం.

లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో రిలీజ్ కావల్సిన బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ మూవీ ‘సూర్యవన్షీ’ కూడా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే స్టారర్ మూవీ ‘83’ ని నవంబర్‌లో రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్, రణ్‌బీర్ కపూర్ సరికొత్త లుక్‌లో చేస్తున్న పీరియాడిక్ డ్రామా మూవీ ‘షంషేరా’, రణ్‌వీర్ సింగ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’ తో పాటు అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ జంటగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’.. ఇలా సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి.