VIT Students Fight : వామ్మో.. వీళ్లు విద్యార్థులా? వీడి రౌడీలా? కుర్చీలు, ప్లేట్లతో పొట్టు పొట్టు కొట్టుకున్న పోరగాళ్లు

వీఐటీ కాలేజీ క్యాంపస్ హాస్టల్ క్యాంటీన్ లో విద్యార్థులు రెచ్చిపోయారు. దారుణంగా కొట్టుకున్నారు. ఒక విద్యార్థిని కిందపడేసి కొందరు విద్యార్థులు చితక్కొట్టారు. కుర్చీలు, ప్లేట్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

VIT Students Fight : వామ్మో.. వీళ్లు విద్యార్థులా? వీడి రౌడీలా? కుర్చీలు, ప్లేట్లతో పొట్టు పొట్టు కొట్టుకున్న పోరగాళ్లు

VIT Students Fight : కాలేజీలో విద్యార్థుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఇది చాలా కామన్. అయితే ఇటీవలి కాలంలో స్టూడెంట్స్ హద్దులు మీరుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి గొడవలు హింసాత్మకంగా మారుతున్నాయి. విద్యార్థులు దారుణంగా కొట్టుకుంటున్నారు. రక్తం కారేలా, ప్రాణాలు పోయేలా ఫైట్ చేస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం వెల్లూరులోని వీఐటీ కాలేజీ క్యాంపస్ హాస్టల్ క్యాంటీన్ లో విద్యార్థులు రెచ్చిపోయారు. దారుణంగా కొట్టుకున్నారు. ఒక విద్యార్థిని కిందపడేసి కొందరు విద్యార్థులు చితక్కొట్టారు. కుర్చీలు, ప్లేట్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ బెట్ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ గొడవ ఇదిగో ఇలా ఫైటింగ్ కు దారితీసింది. విద్యార్థులు కొట్టుకోవడం చూసి అంతా నివ్వెరపోతున్నారు. వామ్మో.. వీళ్లసలు విద్యార్థులా? వీధి రౌడీలా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Attack On Bank Staff : వామ్మో.. పేపర్ అడిగాడని.. బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టిన కస్టమర్.. వీడియో వైరల్

హాస్టల్ లో విద్యార్థులు కొట్టుకుంటుండగా.. మరికొందరు విద్యార్థులు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. అయితే, వారిని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. విద్యార్థుల తీరు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. బుద్ధిగా చదువుకోవాల్సిన వారు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Fight Over Window Seat : ఇదేందయ్యా ఇది.. విమానంలో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్

అర్థం లేని ఆవేశంతో చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. పిల్లలను ప్రయోజకులను చేసేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేసి చదివిస్తుంటే, వాళ్లేమో ఇలా కొట్టుకుని చస్తున్నారని బాధపడుతున్నారు. కాగా, ఇలాంటి ఘటనలు రిపీట్ అవకుండా కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.