Attack On Bank Staff : వామ్మో.. పేపర్ అడిగాడని.. బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టిన కస్టమర్.. వీడియో వైరల్

ఓ బ్యాంకులో వ్యవహారం ముదిరింది. కొట్టుకునే వరకు వెళ్లింది. ఓ కస్టమర్ బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Attack On Bank Staff : వామ్మో.. పేపర్ అడిగాడని.. బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టిన కస్టమర్.. వీడియో వైరల్

Attack On Bank Staff : బ్యాంకుల్లో ఉద్యోగులు, కస్టమర్ల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఇది కామన్. ఒక్కోసారి ఉద్యోగులు తప్పు చేస్తే మరోసారి కస్టమర్లు తొందరపడుతుంటారు. ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన కస్టమర్లు వారితో గొడవకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ఓ బ్యాంకులో ఈ వ్యవహారం ముదిరింది. కొట్టుకునే వరకు వెళ్లింది. ఓ కస్టమర్ బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ రాష్ట్రం నడియాడ్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు కస్టమర్లు బ్యాంకు ఉద్యోగిపై దాడి చేశారు. మిగతా సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఉద్యోగిని వారు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. కాలితో దారుణంగా తన్నారు.

ఉద్యోగి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారిపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితుడు లోన్ డెస్క్ లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బ్యాంకుకి వచ్చిన కస్టమర్ సామ్రాట్.. వచ్చీ రాగానే తనపై దాడికి దిగాడని బాధితుడు వాపోయాడు.

దాడికి పాల్పడిన ఇద్దరిలో సామ్రాట్ అనే వ్యక్తి బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ పేపర్ చూపించాలని బ్యాంకు సిబ్బంది ఆ వ్యక్తిని అడిగారు. అయితే, ఆ పేపర్ చూపించడానికి సామ్రాట్ ఒప్పుకోలేదు. అంతేకాదు.. ఉద్యోగికి ఫోన్ చేసి బెదిరించాడు. మరోసారి ఆ పేపర్ గురించి అడిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చాడు.

బ్యాంక్ ఆడిట్ సమయంలో బ్యాంక్‌కి అవసరమైన హౌస్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీని సమర్పించడంలో సామ్రాట్ విఫలమయ్యాడు. దీని గురించి ఉద్యోగి అడగ్గా.. అతడు ఇలా దాడికి పాల్పడ్డాడు. బ్యాంకుకు వచ్చి డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో తోటి ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టిన కస్టమర్..