BRICS: బ్రిక్స్ దేశాల జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల స‌ద‌స్సులో పాల్గొన్న అజిత్ డోభాల్‌

బ్రెజిల్, ర‌ష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల‌ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశ‌మ‌య్యారు. బ్రిక్స్ దేశాలకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే స్పందించాల్సిన తీరు, జాతీయ భ‌ద్ర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించారు.

BRICS: బ్రిక్స్ దేశాల జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల స‌ద‌స్సులో పాల్గొన్న అజిత్ డోభాల్‌

BRICS: బ్రెజిల్, ర‌ష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల‌ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశ‌మ‌య్యారు. బ్రిక్స్ దేశాలకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే స్పందించాల్సిన తీరు, జాతీయ భ‌ద్ర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో మ‌న దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ పాల్గొన్నారు.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా బ్రిక్స్ దేశాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆయ‌న అన్నారు. 14వ బ్రిక్స్ స‌ద‌స్సు సానుకూల వాతావ‌ర‌ణంలో, ఫ‌ల‌వంతంగా జ‌రిగేందుకు ప‌నిచేస్తామ‌ని అన్ని దేశాల ఐదు దేశాల జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు చెప్పారు. ఉగ్ర‌వాదంతో పాటు సైబ‌ర్ భ‌ద్ర‌తపై అన్ని దేశాలు క‌లిసి ప‌నిచేయాల్సిన అంశంపై కూడా వారు చ‌ర్చలు జ‌రిపారు. కాగా, 14వ బ్రిక్స్ స‌మావేశం చైనా నేతృత్వంలో ఈ నెల 23, 24వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది. బ్రిక్స్ దేశాల కూట‌మికి అంత‌ర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని చైనా పేర్కొంది.