lndia vs Bangladesh: బంగ్లా జట్టుపై టీమిండియా ఓటమికి కారణం ఏమిటి? కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే.

బ్యాటింగ్ లో విఫలం కావటం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని రోహిత్ అన్నారు. కేఎల్ రాహుల్ (73) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేక పోయామని అన్నారు. అయితే.. టీమిండియా ఓటమికి రాహుల్ నే కారణమంటూ వస్తున్న విమర్శలపై రోహిత్ స్పందిస్తూ..

lndia vs Bangladesh: బంగ్లా జట్టుపై టీమిండియా ఓటమికి కారణం ఏమిటి? కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే.

Rohit Sharma

lndia vs Bangladesh:టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. చివరి వరకు బంగ్లా జట్టు విజయాన్ని అడ్డుకొనేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ తొమ్మిది వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. టీమిండియా ఓటమికి కేఎల్ రాహుల్ ప్రధాన కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. కీలక సమయంలో మెహిది హసన్ క్యాచ్‌ జారవిడిచి టీమిండియా ఓటమికి రాహుల్ ప్రధాన కారకుడయ్యాడంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాహుల్ ఈ క్యాచ్ పట్టిఉంటే భారత్ విజయం సాధించేది.

Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడారు. టీమిండియా ఓటమికి గల కారణాలను వివరించారు. బ్యాటింగ్ లో మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారని రోహిత్ ప్రసంశించారు. తక్కువ స్కోర్ చేసినప్పటికీ చివరి వరకు మ్యాచ్ ను బౌలర్లు కాపాడారు. తొలి బంతి నుంచి బంగ్లా బ్యాటర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదని రోహిత్ అన్నారు.

Rohit Sharma : టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్

బ్యాటింగ్ లో విఫలం కావటం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని రోహిత్ అన్నారు. కేఎల్ రాహుల్ (73) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేక పోయామని అన్నారు. అయితే.. టీమిండియా ఓటమికి రాహుల్ నే కారణమంటూ వస్తున్న విమర్శలపై రోహిత్ స్పందిస్తూ.. అలా ఏం కాదు.. మేము 240 పరుగులు వరకు చేసిఉంటే విజయం సాధించేవాళ్లం. నామ మాత్రపు స్కోర్ చేయడం వల్లనే ఓడిపోవాల్సి వచ్చింది. అయినా బౌలర్ల కారణంగా చివరి వరకు బంగ్లా విజయాన్ని అడ్డుకోగలిగాం అని రోహిత్ అన్నారు. ఇదిలాఉంటే బుధవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.