Sravana Bhargavi : శ్రావణభార్గవిపై తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. వీడియో తొలగించాలని అన్నమయ్య వంశస్థుల డిమాండ్..

శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై..’ అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడింది. అయితే ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు........

Sravana Bhargavi : శ్రావణభార్గవిపై తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. వీడియో తొలగించాలని అన్నమయ్య వంశస్థుల డిమాండ్..

Sravana Bhargavi

Updated On : July 23, 2022 / 2:07 PM IST

Sravana Bhargavi :  టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించిన శ్రావణ భార్గవి కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో తన వీడియోలతో కూడా మెప్పిస్తుంది. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై..’ అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడింది. అయితే ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యారు.

అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి ఇలా తన అందాన్ని చూపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి వీడియో చేయడం చాలా తప్పని అన్నమయ్య వంశస్థులు ఆగ్రహించారు. ఇదే విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడమని, వీడియో తీయమని అడిగితే ఆమె సరిగ్గా సమాధానమివ్వలేదని, ఈ విషయంలో శ్రావణ భార్గవి చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తుందని హరినారాయణ చార్యులు తెలిపారు. శ్రావణ భార్గవి దీనిపై స్పందిస్తూ మనం చూసే కళ్ళ బట్టి ఉంటుంది ఏదైనా అని, తాను చేసింది కరెక్ట్ అని సమర్ధించుకుంది.

Arjun : ఆ విషాదాలు మరవకముందే.. యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి కన్నుమూత..

వీడియో తీయకపోగా, తాను చేసింది కరెక్ట్ అంటూ మాట్లాడటంతో గాయని శ్రావణి భార్గవి పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని, పాట తొలగించాలని విజ్ఞప్తి చేసిన తాళ్లపాక వంశీయులతో శ్రావణి భార్గవి దురుసుగా మాట్లాడారని శ్రావణి భార్గవి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నమయ్య అభిమానులు. తన చర్యతో శ్రావణభార్గవి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు.