Cauliflower : చలికాలంలో రక్తప్రసరణ మెరుగుపరిచే కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపర్చటంలో తోడ్పడుతుంది.

Cauliflower : చలికాలంలో రక్తప్రసరణ మెరుగుపరిచే కాలీఫ్లవర్

Cauliflower

Cauliflower : కాలీప్లవర్ ఇది తెల్లని రంగులో పువ్వు రూపంలో ఉంటుంది. శీతాకాలంలో ప్రధానంగా కాలీఫ్లవర్ అధికంగా మార్కెట్‌లోకి వస్తుంటుంది. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, విటమిన్ ఎ, బి, సి,పొటాషియం కూడా ఉంటుంది. కాలీఫ్లవర్ , క్యాబేజీ ఈ రెండు బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. రుచితోపాటు ఆరోగ్యప్రయోజనాలను కాలీఫ్లవర్ అందిస్తుంది.

దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా కాలీఫ్లవర్‌ తింటే ఉపశమనం పొందవచ్చు. కాలీఫ్లవర్‌లో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేగాక… కాలీఫ్లవర్‌ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజు వారిగా కాలీఫ్లవర్ తినటం వల్ల రక్త ప్రసరణను మెరుగుపర్చటంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా కాలిఫ్లవర్‌ని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో హీమోగ్లోబిన్ ను పెంచుతుంది.

కాలీఫ్లవర్‌ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపర్చటంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి , కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎముకులు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించటంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును చురుకుగా మార్చుతుంది. బరువు తగ్గాటానికి ఇది బెస్ట్ గా చెప్తున్నారు నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్న వారు సైతం కాలీఫ్లవర్ ను తీసుకోవచ్చు.

చర్మ సమస్యలను తగ్గించటంలో కాలీఫ్లవర్ బాగా ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తోపాటు మాంగనీస్ ఉంటుంది. చలికాలంలో అధికంగా లభించే కాలీఫ్లవర్ ను తీసుకోవటం వల్ల శరీరానికి మంచి పోషకాహారం అందించినట్లవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరగటం వల్ల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తీసుకోకపోవటం ఉత్తమం. దీన్ని తీసుకోవడం వల్ల టి3,టి4 హార్మోన్లు పెరుగుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో పిండి పదార్థాల వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.