Real KGF : రియల్ ‘కేజీఎఫ్’: 20 ఏళ్ల క్రితం మూతపడిన కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్‌పై కేంద్రం ఫోకస్..తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం

కేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు వింటే.. బాక్సాఫీస్‌ బ్యాండ్ బజాయించిన సినిమానే గుర్తొస్తుంది. రాఖీభాష్ చేతిలోని నిప్పులు కురిపించిన సమ్మెట కనిపిస్తుంది. నరాచీ ప్రస్తావన వస్తే.. బంగారు గనుల్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇదంతా సినిమా వరకే. కానీ.. నిజమైన కేజీఎఫ్ ఉందని మీకు తెలుసా? ఇది కేజీఎఫ్ సినిమా కాదు నిజమైనకేజీఎఫ్ 20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్ గోల్డ్ మైనింగ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Real KGF : రియల్  ‘కేజీఎఫ్’: 20 ఏళ్ల క్రితం మూతపడిన కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్‌పై కేంద్రం ఫోకస్..తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం

Real KGF In Karnataka

Kolar Gold Fields In karnataka : కేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు వింటే.. బాక్సాఫీస్‌ బ్యాండ్ బజాయించిన సినిమానే గుర్తొస్తుంది. రాఖీభాష్ చేతిలోని నిప్పులు కురిపించిన సమ్మెట కనిపిస్తుంది. నరాచీ ప్రస్తావన వస్తే.. బంగారు గనుల్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇదంతా సినిమా వరకే. కానీ.. నిజమైన కేజీఎఫ్ ఉందని మీకు తెలుసా? ఇది కేజీఎఫ్ సినిమా కాదు నిజమైనకేజీఎఫ్ 20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్ గోల్డ్ మైనింగ్స్ పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

ఇది కేజీఎఫ్ సినిమా కాదు..రియల్ కేజీఎఫ్. కేజీఎఫ్ సినిమాకు స్ఫూర్తినిచ్చిన రియల్ లైఫ్ స్టోరీ. ఎటువంటి అంచనాలు లేకుండా ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ దుమ్ము దులిపి.. కలెక్షన్ల రికార్డులను ఊచకోత కోసిన కేజీఎఫ్ కు సంబంధించి రియల్ కోలారర్ గోల్డ్ గనులు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో దాదాపు 100ఏళ్లకు పైగా బంగారం తవ్వకాలు జరిపారు. బ్రిటీష్ వాళ్లు భారత్ ను పారలించిన సమయంలో ఈ కోలార్ మైన్స్ లో ఉన్న బంగారం భారీగా తరలించుకుపోయిర కేవలం కేజీఎఫ్ సినిమాను మాత్రం మనకు వదిలేనట్లైంది. కేజీఎఫ్ సినిమా వెనుక ఓ చరిత్ర దాగుంది. దాని పేరే.. ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’. కేజీఎఫ్ మూతపడే నాటికే అక్కడంతా రాళ్ల దిబ్బలా మారిపోయింది. ఇప్పటికీ అలాగే ఉన్నా..అక్కడున్న ప్రతి రాయికి ఓ చరిత్ర ఉంది.

అసలు.. రియల్ కేజీఎఫ్ ఎక్కడుంది? అక్కడ బంగారం తవ్వకాలు ఎప్పుడు ఆపేశారు? ఎందుకు ఆపేశారు. అనే ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి.కేజీఎఫ్ సినిమా కంటే ముందే ఆ ప్రాంతంలో చాలా సినిమా షూటింగులు జరిగినా కేజీఎఫ్ తరువాతే ఆ ప్రాంతానిక క్రేజ్ వచ్చింది. కేజీఎఫ్ సినిమా చూశాక.. చాలా మంది ఇంటర్నెట్‌లో దాని గురించే సెర్చ్ చేసి..నిజంగా కర్ణాటకలో కోలార్ గోల్డ్ గనులు ఉన్నాయా? అని వెతికారు. అయితే.. కేజీఎఫ్ షూటింగ్ జరిగిన చోట నిజంగానే గోల్డ్ మైన్స్ ఉండేవని.. ఒకప్పుడు అక్కడి నుంచి టన్నుల్లో బంగారం బయటకు తీశారని.. కొందరికి మాత్రమే తెలుసు.

కేజీఎఫ్‌లో ఇంకా విశాలమైన బంగ్లాలు, పోస్టాఫీసులు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, క్లబ్‌ హౌస్‌లు 150 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. భారత్‌ గోల్డ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌.. 2001లో కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. అలాంటి చోట.. మళ్లీ బంగారం కోసం తవ్వకాలు జరుపుతారనే వార్త.. ఇండియా వైడ్ ఇంట్రస్టింగ్‌గా మారింది. నిజానికి.. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ప్రపంచంలోనే రెండో లోతైన బంగారు గని. 18 వేల అడుగుల లోతులో దాదాపు 121 ఏళ్ల పాటు బంగారం తవ్వకాలు జరిపారు. అయితే.. ఛాంపియన్ రీఫ్‌ మైన్‌లోకి లోతుగా వెళ్లడం ఎంతో ప్రమాదకరం. కేవలం అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఆ పని చేయగలరు. ఆ మధ్య ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్‌గానూ మారుస్తారన్న వార్తలు వచ్చాయి. అదే జరిగితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే అంతకు మించిన న్యూస్ బయటకొచ్చింది. 2 దశాబ్దాల కిందటే మూతబడిన మైన్స్‌లో.. మళ్లీ బంగారం తవ్వకాలకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయ్. కేజీఎఫ్‌ సుమారుగా 12 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్లకు పైగా ఇక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు జరపడంతో.. ఆ ప్రాంతం ఇంకెందుకూ పనికిరాదనుకున్నారు. అయితే.. తవ్వి తీయాలే గానీ.. అక్కడ బంగారం దొరుకుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే.. కేంద్ర ప్రభుత్వం మళ్లీ కేజీఎఫ్‌పై ఫోకస్ పెట్టింది.