Chamanthi Cultivation : లాభాలు పూయిస్తున్న చామంతి పూల సాగు

రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, మస్కాపూర్ గ్రామానికి చెందిన రైతు బాశెట్టి నర్సయ్య . తనకున్న ఎకరన్నర పొలంలో నాలుగేళ్లుగా ప్రణాళిక బద్ధంగా చామంతి పూల సాగు చేపడుతున్నారు.

Chamanthi Cultivation : లాభాలు పూయిస్తున్న చామంతి పూల సాగు

Chamanthi Sagu

Chamanthi Cultivation : చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో పాలీహౌస్ లలో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడి సాధిస్తున్నారు.

READ ALSO : Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!

ఒకసారి మొక్క నాటితే రెండు నుంచి మూడేళ్లపాటు పంట కొనసాగటం విశేషం. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు దీర్ఘకాలిక చామంతి రకాన్ని పాలీహౌస్ లో కాకుండా ఆరుబయట సాగుచేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు.

రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు… వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, మస్కాపూర్ గ్రామానికి చెందిన రైతు బాశెట్టి నర్సయ్య . తనకున్న ఎకరన్నర పొలంలో నాలుగేళ్లుగా ప్రణాళిక బద్ధంగా చామంతి పూల సాగు చేపడుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ.. లాభాల బాట పడుతున్నారు.

READ ALSO : Jasmine : మల్లెసాగులో సస్యరక్షణ, యాజమాన్యం

పండుగ సీజన్ ల సమయంలో పూలకు అధిక ధర పలుకుతుండగా సాధరణ సమయంలో కూడా గిట్టుబాటు ధర లభిస్తోంది. అంతే కాదు పూలసాగుతో గ్రామంలోని కొంత మంది యువకులకు నిత్యం పని దొరుకుతోంది.

తక్కువ నీటి వనరులు, తక్కువ సమయంలో, రోజువారి దిగుబడులునిచ్చే పూల సాగు ఇప్పుడు విస్తరిస్తోంది. ఇంత కాలం సంప్రదాయ పంటలు, పండ్ల తోటల వరకే పరిమితమైన రైతలు.. ఇప్పుడు పూలసాగు చేపడుతున్నారు. మార్కెట్ కు అనుగుణంగా రకరకాల చామంతిపూల సాగును చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Lily Cultivation : లిల్లీ సాగులో చీడపీడల నివారణ పద్ధతులు!