Chandini Chowdary : ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తా అని బెదిరించాడు..

ఓ నిర్మాత మీ కెరీర్ ఆపేస్తా అని భయపెట్టాడంట అని అలీ అడగగా చాందిని మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఓ నిర్మాత బెదిరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని..............

Chandini Chowdary : ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తా అని బెదిరించాడు..

Chandini Chowdary

Updated On : June 17, 2022 / 7:01 AM IST

Chandini Chowdary :  షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి పలు సినిమాల్లో నటించి ఇటీవల కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టింది చాందిని చౌదరి. ప్రస్తుతం యువ హీరో కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా జూన్‌ 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా సమ్మతమే ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఓ నిర్మాత మీ కెరీర్ ఆపేస్తా అని భయపెట్టాడంట అని అలీ అడగగా చాందిని మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఓ నిర్మాత బెదిరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు. కానీ చివరికి నాతో సైన్‌ చేయించుకున్న కాంట్రాక్ట్‌ వ్యాలిడ్‌ కాదని నాకు తెలిసింది” అని చెప్పింది.

Brahmastra : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర.. ఎందుకు??

ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలను కలవలేదా అని అలీ అడగగా.. ”ఎవరి దగ్గరకు వెళ్లను? నన్ను నేను బ్యాకప్‌ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా” అంటూ ఎమోషనల్ అయింది చాందిని. దీంతో చాందిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అని ఆలోచిస్తున్నారు అంతా. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.