lakshmi parvathi: చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది?: లక్ష్మీ పార్వతి

సంక్షేమ ప‌థ‌కాల‌ డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయో లేదో ప్రజలను అడిగితే చేస్తే నిజాలు తెలుస్తాయని ఆమె అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వ‌ర్ణించిన‌ట్లు ఉంద‌ని చెప్పారు. ''చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది.. డబ్బులు పడుతున్నాయో లేదో ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది'' అని ఆమె చుర‌క‌లంటించారు.

lakshmi parvathi: చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది?: లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi

lakshmi parvathi: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ల‌క్ష్మీ పార్వ‌తి తిప్పికొట్టారు. గుంటూరు జిల్లా చిన‌కాకానిలో వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తోన్న నేప‌థ్యంలో ఆమె అక్క‌డ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా 10 టీవీతో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు అని అన్నారు. 20 కేసులు ఉంటే ఒకాయన సాయంతో కొట్టించేసుకున్న చంద్రబాబా త‌మ గురించి మాట్లాడేది అని ఆమె నిల‌దీశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదని చెప్పుకొచ్చారు. సంక్షేమ ప‌థ‌కాల‌ డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయో లేదో ప్రజలను అడిగితే చేస్తే నిజాలు తెలుస్తాయని ఆమె అన్నారు.

sajjala: జగన్ నేడు దిశానిర్దేశం చేస్తారు: స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వ‌ర్ణించిన‌ట్లు ఉంద‌ని చెప్పారు. ”చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది.. డబ్బులు పడుతున్నాయో లేదో ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది” అని ఆమె చుర‌క‌లంటించారు. వైపీసీ ప్లీనరీలో ఎక్కడ చూసినా జన సందోహంతో పండగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. ఇవాళ 3 లక్షల మందిపైగా వస్తారని అంచనా వేస్తున్నామ‌ని తెలిపారు. ఇటువంటి ప్లీనరీలను నిర్వ‌హించే స‌మ‌ర్థ‌త‌ ఎన్టీఆర్, వైఎస్సార్‌కే ఉండేద‌ని, ఇప్పుడు జగన్ మాత్రమే నిర్వహించగ‌లుగుతున్నార‌ని చెప్పారు.