Chandrika Ravi : వెన్నునొప్పితోనే డ్యాన్స్ చేశాను.. బాలకృష్ణతో స్పెషల్ సాంగ్ చేసిన ఆస్ట్రేలియా నటి..

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రిక రవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రిక రవి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో పెరిగినా మా ఇంట్లో దక్షిణ భారత దేశ కల్చర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచే.................

Chandrika Ravi : వెన్నునొప్పితోనే డ్యాన్స్ చేశాను.. బాలకృష్ణతో స్పెషల్ సాంగ్ చేసిన ఆస్ట్రేలియా నటి..

Chandrika Ravi about dance with Balakrishna

Chandrika Ravi :  బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే అంతో ఓ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బాలయ్యతో భారత మూలాలున్న ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి డ్యాన్స్ చేసింది.

Salman Khan : సల్మాన్ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్..

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రిక రవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రిక రవి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో పెరిగినా మా ఇంట్లో దక్షిణ భారత దేశ కల్చర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్సులు నేర్చుకున్నాను. బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం నా అదృష్టం. ఆ పాట షూటింగ్ టైంలో లాస్ట్ రోజు నా వెన్ను కాస్త బెణికింది. చాలా నొప్పి అనిపించింది. కానీ సెట్ లో ఎవరికీ చెప్పలేదు, చెప్తే నా వల్ల షూటింగ్ కి ఇబ్బంది కలుగుతుంది, చివరి రోజు ఎలాగో అని చెప్పలేదు. ఆ నొప్పితోనే డ్యాన్స్ చేశాను. పాట విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషమేసింది. ప్రస్తుతం ఒక తమిళ్ సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో కొన్ని చర్చిస్తున్నాను అని తెలిపింది.