Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర.. 48 మంది మృతి

ఈ నెల 3న ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.

Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర.. 48 మంది మృతి

Chardham Yatra

Chardham Yatra: ఈ నెల 3న ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు. అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, మౌంటేన్ సిక్‌నెస్ ఈ మరణాలకు ప్రధాన కారణాలని అధికారులు చెప్పారు. బద్రినాథ్, ద్వారక, పూరి, రామేశ్వరం కలిపి ఛార్‌ధామ్‌గా పిలుస్తారు.

Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

ఈ యాత్ర సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్‌నాథ్‪‌ను భక్తులు దర్శించుకుంటారు. అయితే, ఇవి హిమాల పర్వత ప్రాంతం సమీపంలో ఉండటంతో ఇక్కడికి చేరుకోవడం కష్టమైన పని. చుట్టూ ఎత్తైన మంచు కొండల మధ్య నుంచి ప్రయాణం చేయాలి. ఇది భక్తులకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో చాలా మంది యాత్రికులు ప్రయాణం మధ్యలో మరణిస్తున్నారు. అయితే, ప్రభుత్వం యాత్ర మార్గంలో అనేక ప్రదేశాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రికులను వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.

Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

కాగా, యాత్రికులు తమ ప్రయాణం మొదలుపెట్టేముందు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది. డాక్టర్ల సలహామేరకే యాత్ర చేయాలని సూచించింది. అలాగే యాత్రికులు తమ ఆహారం, నీళ్లు వంటివి ముందుగానే సమకూర్చుకోవాలని చెప్పింది.