Chikoti Praveen: నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్.. కీలక వివరాలు సేకరించనున్న అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు నేడు విచారణకు హాజరు కానున్నారు.

Chikoti Praveen: నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్.. కీలక వివరాలు సేకరించనున్న అధికారులు

Chikoti Praveen

Chikoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, వారిని విదేశాల్లో క్యాసినో ఆడించి లాటరీ డబ్బులను పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. మూడు రోజలుగా చీకోటి ప్రవీణ్ ఇంటితో పాటు, అతనికి సంబంధించిన అనేక ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, సంపత్ లకు కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు వీరు ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు.

Chikoti Praveen : ఒక్కొక్కటిగా వెలుగులోకి క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు

విదేశాల్లో క్యాసినో పై ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు. ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హవాల రూపంలో సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ అనే నలుగురు ఏజెంట్లు నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం సేకరించిన అధికారులు, చీకోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. చీకోటికి చెందిన నాలుగు బ్యాంకు అకౌంట్లను ఉన్నట్లు గుర్తించారు. ఈ అకౌంట్ల ద్వారా పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు తెలుస్తోంది.

Chikoti Praveen : జూపార్క్‌లా ఉన్న చికోటి ఫాంహౌస్‌..షాక్ అయిన ఫారెస్ట్ అధికారులు

మరోవైపు క్యాసినో విషయంలో సినీ, రాజకీయ నేతలకు నోటీసుల చెల్లింపులపై ఈడీ విచారణలో ఆరా తీయనుంది. పది మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్ లిస్ట్ ముందుంచి ఈడీ ప్రశ్నించే అవకాశముంది. అంతేకాక బిగ్‌డాడీ అడ్డాగా ప్రమోషన్ పై ఈడీ చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ ను ప్రశ్నించనుంది.