Madvi Hidma : హిడ్మాకి దొరికితే.. కిరాతకంగా చంపేస్తాడు.. అతడి యుద్ధ విద్యలు ఇక్కడివి కావు!

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ మావోయిస్టుల దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బలగాలపై దాడికి వ్యూహా రచన చేసింది.. మడవి హిడ్మా.. అంతుచిక్కడు.. తన ఉనికిపై తానే సమాచారం ఇస్తాడు.

Madvi Hidma : హిడ్మాకి దొరికితే.. కిరాతకంగా చంపేస్తాడు.. అతడి యుద్ధ విద్యలు ఇక్కడివి కావు!

Chhattisgarh Maoist Attack (3)

Chhattisgarh Maoist Attack : ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ మావోయిస్టుల దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బలగాలపై దాడికి వ్యూహా రచన చేసింది.. మడవి హిడ్మా.. అంతుచిక్కడు.. తన ఉనికిపై తానే సమాచారం ఇస్తాడు. కాపుకాసి.. ఎరవేసి.. జవాన్లను హతమార్చడం ఇతగాడి వ్యూహం. అందులో భాగంగానే 23 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నాడు. హిడ్మాకు అత్యంత కఠిన మావోయిస్టుగా దళంలో పేరుంది. అనుసరించే వ్యూహాలు రహాస్యంగా ఉంటాయి. వ్యూహంలో చిక్కుకుంటే ప్రాణాలతో బయటికి వెళ్లలేరు. చేతికి చిక్కిన, ఎదురైన శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. జాలి దయ ఉండదు.. మరణించేవరకు చంపాలన్నది హిడ్మా సిద్ధాంతం. ఈ తరహా పాశవిక దాడులు గతంలో మావోయిస్టులు అనుసరించలేదు. 2010 నుంచి మావోల దాడుల్లో, వ్యూహాల్లో, ఆపరేషన్లు నిర్వహించే తీరులో అనూహ్య మార్పులు వచ్చాయి.

మావోయిస్టుల ప్రతి దాడిలోనూ ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పాశవిక యుద్ధ విద్యలు భారత్‌కు చెందినవి కావు. తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలాంటి దేశాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనుసరించే వ్యూహాలుగా చెబుతున్నారు. అక్కడి వ్యూహాలు ఇక్కడి వారు మావోలు ఎలా అమలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఓ సమాధానం వినిపిస్తోంది. దశాబ్దానికిపైగా జరిగిన భారీ ఆపరేషన్లకు హిడ్మానే వ్యూహరచన చేశాడని నిఘా వర్గాల సమాచారం. పీఎల్‌జీఏ బెటాలియన్‌–1కు కమాండర్‌ అయిన హిడ్మా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. హిడ్మా కోసం గాలిస్తూ ఆవేశంగా మావోలకు పట్టున్న ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాయి. అవకాశం కోసం చూస్తున్న హిడ్మా మరిన్ని ఉచ్చులతో మరో భారీ దాడికి దిగే అవకాశం లేకపోలేదని పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు.

మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ ఇడ్మాల్‌ అలియాస్‌ పొడియం బీమా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే. హిందీ–ఇంగ్లి్లష్‌ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలిసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు.

మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే ఉన్నారు. హిడ్మా దశాబ్దానికి ముందే ఫిలి ప్పీన్స్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటి మావోయిస్టు చీఫ్‌ గణపతి ఆదేశాల మేరకు హిడ్మా బీహార్ మీదుగా నేపాల్‌ వెళ్లి, అక్కడ నుంచి దొంగ పాస్‌పోర్టు ద్వారా ఫిలిప్పీన్స్‌ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. హిడ్మా వ్యూహాలన్నీ మూడంచెల్లో ఉంటాయి. ముందు బాంబులతో దాడి చేస్తాడు.. ఆ తర్వాత బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు.. ఆపై గొంతులు కోయడం, శరీరాన్ని కత్తులతో తూట్లుగా పొడవడం వంటి చేస్తాడు. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు అనుసరించే యుద్ధతంత్రాలని హిడ్మా అనుసరిస్తుంటాడని సీనియర్‌ పోలీసు అధికారులు అంటున్నారు.