Bangalore : RCB మ్యాచ్ గెలుస్తుందా? ఆ చిన్నారి స్కూల్లో జాయిన్ అవుతుందా? దీనికి దానికి లింక్ ఏంటి? మీరే చదవండి.

సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తల్లిదండ్రులు పిల్లలతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పేరెంట్స్‌కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు షాకవుతారు.

Bangalore : RCB మ్యాచ్ గెలుస్తుందా? ఆ చిన్నారి స్కూల్లో జాయిన్ అవుతుందా? దీనికి దానికి లింక్ ఏంటి? మీరే చదవండి.

Bangalore

Bangalore :  వైరల్ అవ్వడానికి చోటు వెతుక్కుంటున్నారు చాలామంది. పసి పిల్లల్ని కూడా పేరెంట్స్ ఇందులో భాగం చేసేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ప్లకార్డు పట్టుకున్న ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతోంది.

housing crisis : అద్దె ఇంటి కోసం ఐపీఎల్ మ్యాచ్‌ని వదల్లేదుగా.. బెంగళూరులో ఓ వ్యక్తి ఏం చేసాడో చూడండి

సోషల్ మీడియాలో తమని గుర్తిస్తే చాలు పెద్ద హోదాగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలామంది. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు. చాలామంది తమ పిల్లల చేత కూడా రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. ఊహ తెలియని చిన్నారుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RCB జెర్సీని వేసుకుని, “RCB IPL గెలిచే వరకు నేను స్కూల్‌లో జాయిన్ అవ్వను” అనే ప్లకార్డుతో కనిపించిన చిన్నారిని చూసి .. ఆమె పేరెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇవేం పిచ్చిపనులు అంటూ మండిపడుతున్నారు.

Zero Shadow Day : పట్టపగలు కనిపించని నీడ .. బెంగళూరులో జీరో షాడో డే వింత..!!

2007లో ఐపీఎల్ మొదలైంది. అప్పటి నుంచి RCB ఏ సీజన్ లోనూ గెలవలేదు. ఇక ఈ చిన్నారితో ఇలాంటి ప్లకార్డులు మోస్తే ఇక ఆ పాప స్కూల్ కి వెళ్లినట్లే అని జనం కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే వైరల్ అవ్వాలనే కోరిక ఉంటే పిల్లలకు ఇతర కళల్లో ప్రోత్సహించాలి కానీ ఇలా మ్యాచ్‌లలో ప్లకార్డులతో ప్రతిజ్ఞలు చేయించడమేంటని జనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.