Bhola Shankar : సమ్మర్ కి రెడీ అవుతున్న భోళా శంకర్.. మెగాస్టార్ బర్త్ డేకి ఒకరోజు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్..

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఉండటంతో ఒక రోజు ముందే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని భోళాశంకర్ సినిమా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు చిత్ర యూనిట్. ప్రస్త్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా..............

Bhola Shankar : సమ్మర్ కి రెడీ అవుతున్న భోళా శంకర్.. మెగాస్టార్ బర్త్ డేకి ఒకరోజు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్..

Chiranjeevi Bhola Shankar movie release date revealed

Updated On : August 21, 2022 / 1:57 PM IST

Bhola Shankar :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా కాలం తర్వాత మోహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్‌’. తమిళ సూపర్‌ హిట్‌ సినిమా వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా.

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఉండటంతో ఒక రోజు ముందే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని భోళాశంకర్ సినిమా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు చిత్ర యూనిట్. ప్రస్త్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ లో మెగా ట్రీట్ కి రెడీగా ఉండబోతున్నారు అభిమానులు.

Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. RRR సినిమా చర్చ కోసమా? రాజకీయం కోసమా?

ఇప్పటికే మహేష్ – త్రివిక్రమ్ సినిమాని వచ్చే సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమా కూడా ఏప్రిల్ లోనే ప్రకటించడంతో సమ్మర్ కి ఇప్పట్నుంచే ఫైట్ మొదలయ్యేలా ఉంది.