Bhola Shankar: చిరంజీవి ‘భోళా శంకర్’ ప్రారంభం.. 15నుంచి రెగ్యులర్ షూటింగ్!
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'భోళా శంకర్'.
Bhola Shankar: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం తెలుగు రీమేక్‌గా రూపొందనున్న ఈ సినిమా.. చిరంజీవి కెరీర్లో 155వ సినిమాగా వస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్గా నటించనుండగా.. నవంబర్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో సినిమా తెరకెక్కుతుండగా.. 2022లో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమానికి దర్శకులు శివ కొరటాల, వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని, బాబీ, హరీశ్ శంకర్ విచ్చేశారు.
దర్శకులు డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. మిగిలిన డైరెక్టర్స్ స్క్రిప్ట్ అందించారు, ఫస్ట్ షాట్‌కి అనిల్ రాం బ్రహ్మ సుంకర దర్శకత్వం వహించారు.