Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇకపై మెగాస్టార్ సోదరి చేతిలో..

2006 నుంచి చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ తరపున అత్యవసర సమయాల్లో ఎంతో మందికి రక్తదానం, నేత్ర దానం చేసి దేవుడిలా నిలిచారు. ఇటీవల కరోనా టైంలో సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక కరోనా మరణాలు

Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇకపై మెగాస్టార్ సోదరి చేతిలో..

Chiru

Chiranjeevi : మెగాస్టార్ సినిమాల్లోనే కాదు రియల్ గా కూడా హీరో అని మన అందరికి తెలుసు. సినిమాల్లో విలన్స్ ని కొట్టి హీరోగా మారితే నిజ జీవితంలో ఎంతోమందికి సేవ చేసి హీరోగా మారారు. మెగాస్టార్ చాలా సంవత్సరాలుగా సేవాకార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో 1998లోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సేవలను గొప్పగా, అధికారికంగా ప్రారంభించారు. 2006 నుంచి చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ తరపున అత్యవసర సమయాల్లో ఎంతో మందికి రక్తదానం, నేత్ర దానం చేసి దేవుడిలా నిలిచారు. ఇటీవల కరోనా టైంలో సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక కరోనా మరణాలు పెరగడంతో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్ కూడా ప్రారంభించారు. యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేసి చాలా మంది ప్రాణాల్ని కాపాడారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేసిన సంగతి తెలిసిందే.

Raghavendrarao : నటుడిగా నా ఫస్ట్ చెక్ ని దాచుకున్నా: రాఘవేంద్రరావు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆయన స్థాపించినా మెడికల్ పరంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. గతంలో ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ గా డా.కె గోవిందరెడ్డి ఉండేవారు. ఇటీవల ఆయన పదవి విరమణ చేయడంతో తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ గా మెగాస్టార్ సోదరి డా.మాధవి గారిని నియమించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి చైర్మన్ చిరంజీవి అధికారికంగా ఆదేశాలు పంపించారు. ఇక పై చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంకుని మరింత ప్రగతి పధంలో నడిపించాలని కోరుకున్నారు డా.మాధవి. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది డా.మాధవికి శుభాకాంక్షలు తెలియజేసారు.