RGV : గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవీ

ఆర్జీవీ దేవుడంటే నమ్మడు. కానీ సినిమా ఓపినింగ్ రోజు నిర్మాతలు చేసే పూజలకు సహకరిస్తారు. తాజాగా గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించారు ఆర్జీవీ. ఐతే ఇది మీరు అనుకున్నట్టు

RGV :  గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించిన ఆర్జీవీ

Rgv

RGV :  ఒకప్పుడు సక్సెస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండి తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించిన ప్రతీసారి ఏదో ఒక వివాదం చెలరేగుతుంది. ఇటీవల తెలంగాణ రాజకీయ నాయకుడు కొండా మురళి బయోపిక్ తీయబోతున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో తాను ఇప్పటి వరకు రాయలసీమ ఫ్యాక్షన్ పై, విజయవాడ రౌడీయిజంపై సినిమాలు తీశానని కానీ తెలంగాణ మావోయిస్టులపై సినిమా తీయలేదని అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, మావోయిస్టులు, నక్సలైట్లు గురించి తెల్సుకొని ప్రముఖ రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్రతో ఇవన్నీ సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు. కొండా మురళి, కొండా సురేఖల జీవిత కోణం నుంచి తెలంగాణ పరిస్థితులని, రాజకీయాలని చూపిస్తానని ఇటీవల ప్రకటించాడు.

Telugu Film Shootings: ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే?

ఆర్జీవీ దేవుడంటే నమ్మడు. కానీ సినిమా ఓపినింగ్ రోజు నిర్మాతలు చేసే పూజలకు సహకరిస్తారు. తాజాగా గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించారు ఆర్జీవీ. ఐతే ఇది మీరు అనుకున్నట్టు వివాదాస్పదంగా కాదు. ఆర్జీవీ ప్రకటించిన ‘కొండా’ చిత్రం ప్రారంభోత్స‌వం కోసం ఇవాళ వరంగ‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ వంచ‌న‌గిరి గ్రామంలో సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. షూటింగ్ ప్రారంభించ‌డానికి ముందు అక్క‌డ ఉన్న గండి మైస‌మ్మ అమ్మ‌వారి ఆల‌యాన్నిద‌ర్శించుకున్నారు. అక్కడ పూజలు చేశారు. అయితే అక్క‌డ సాంప్రదాయం ప్రకారం గండి మైస‌మ్మ అమ్మ‌వారికి మందు తాగించి అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకున్నారు ఆర్జీవీ. మనకు తెలిసి కూడా చాలా గ్రామాల్లో ఊరి దేవతలకి కల్లు ప్రసాదంగా పెడతారు. ఇక్కడ మందుని కూడా పెడతారంట. అందులో భాగంగానే ఆర్జీవీ అమ్మవారికి మందు తాగించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాని ఆపేయాలంటూ ఆర్జీవీపై వరంగల్ లో పోలీసులకి ఫిర్యాదు చేశారు. కానీ ఆర్జీవీ ఇలాంటివి పట్టించుకోరని తెలిసిందే. తెలంగాణ రాజ‌కీయాల్లో కొండా ముర‌ళి, సురేఖ‌ల పాత్ర చాలా ఉంది. ఇపుడు వాళ్ళ జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీయబోతున్న ఆర్జీవీ ఈ సినిమాతో ఎన్ని వివాదాలను సృష్టిస్తారో చూడాలి.