Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4000 మందికి వ్యాక్సిన్..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైంది..

Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4000 మందికి వ్యాక్సిన్..

Chiranjeevi Charitable Trust

Chiranjeevi Charitable Trust: కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన సినీ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది.

Chiranjeevi Charitable Trust : సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభం..

ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికి ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 4000 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం.

అలాగే, మిగతా సినిమా రంగానికి సంబంధం అందరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. అప్పుడే షూటింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి, కాబట్టి అందరూ ముందుకు రండి.. వ్యాక్సిన్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు.