Sammakka Saralamma : మేడారం జాతర.. హెలికాప్టర్ సేవలు, రూ. 20 వేల చార్జీ

బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్‌ సిద్ధం చేసింది...

Sammakka Saralamma : మేడారం జాతర.. హెలికాప్టర్ సేవలు, రూ. 20 వేల చార్జీ

Medaram Jatara

Updated On : February 12, 2022 / 8:30 AM IST

Medaram 2022 : తెలంగాణకే తలమానికమైన మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఈ నెల 16న ప్రారంభం కానున్న జాతర నాలుగు రోజుల పాటు జరుగనుంది. మహాజాతరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్‌ నడిపించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్‌ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కోక్కరికి 20వేల రూపాయలు చార్జీగా నిర్ణయించారు.

Read More : Hijab Row: రాజస్థాన్‌లోనూ హిజాబ్ రచ్చ మొదలైందంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇక జాతరలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై సీఎస్‌, డీజీపీ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. తాత్కాలికంగా ఆస్పత్రిని నిర్మించామని, 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా, నీరు కాలుష్యం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేయనున్నట్లు చెప్పారు.

Read More : TDP MLC P Ashok Babu : అశోక్ బాబుకు బెయిల్.. చిన్న నేరంపై ఏడు కేసులా ?

శానిటేషన్ పర్యవేక్షణకు 19 జిల్లాల పంచాయితీ రాజ్ అధికారులను నియమించారు. పంచాయితీ రాజ్ శాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. అటు ఆర్టీసీ 3 వేల 850 బస్సుల ద్వారా 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు చేపట్టింది. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. దాదాపు 9 వేల మంది పోలీసులను నియమించామని.. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.