TDP MLC P Ashok Babu : అశోక్ బాబుకు బెయిల్.. చిన్న నేరంపై ఏడు కేసులా ?

శుక్రవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇద్దరి పూచీకత్తు, 40వేల రూపాయల డిపాజిట్‌తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్‌ విధించిన తర్వాత బెయిల్‌...

TDP MLC P Ashok Babu : అశోక్ బాబుకు బెయిల్.. చిన్న నేరంపై ఏడు కేసులా ?

Mlc Ashok

TDP MLC P Ashok Babu Granted Bail : సీఐడీ చరిత్రలో చిన్న నేరంపై ఏడు కేసులు పెట్టారని అన్నారు ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. సీఐడీ అధికారులు సమ్మెపై విచారించారని…తనపై పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై కక్షపూరితమైన చర్యలు ఆపాలన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెలో తన పాత్ర లేదని…వారు కోరితే మద్దతిస్తామని చెప్పామన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read More : Virat Kohli: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను ఆస్ట్రేలియా లీడర్ కు బహుకరించిన విదేశాంగ శాఖ మంత్రి

2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇద్దరి పూచీకత్తు, 40వేల రూపాయల డిపాజిట్‌తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్‌ విధించిన తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ… తనకు బెయిల్‌ రావడం..కేసుపెట్టిన వారికి చెంపపెట్టు అన్నారు అశోక్‌బాబు. న్యాయమే గెలిచిందని… ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిన న్యాయస్థానాల్లో నిలబడవన్నారు అశోక్‌ బాబు తరఫు న్యాయవాది. సెక్షన్41 పరిగణనలోకి తీసుకోకుండా ఉండేందుకు సంబంధం లేని 468 కింద కేసు పెట్టాడాన్ని న్యాయస్థానం గ్రహించిందన్నారు. గతంలో పెట్టిన కేసుకు నాన్‌ బెయిలెబుల్‌ సెక్షన్స్ కలిపారన్నారు. 17 గంటలపాటు అశోక్‌బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలోని ఉంచి విచారించారు. కొవిడ్‌ పరీక్ష నిర్వహించి నెగిటివ్‌ రావడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు చేశారు.

Read More : Twitter : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు. దీంతో 2022, ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి విజయవాడలోని అశోక్ బాబు ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అంటించారు. అనంతరం అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు. ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.