Bhatti Vikramarka : రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే ప్రధాని మోదీ ఈ కుట్ర చేశారు-భట్టి విక్రమార్క

ప్రధాని అవుతాడన్న భయంతోనే మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటోంది. (Bhatti Vikramarka)

Bhatti Vikramarka : రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే ప్రధాని మోదీ ఈ కుట్ర చేశారు-భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టి సూరత్ కోర్టులో జైలు శిక్ష పడేలా చేశారని ఆరోపించారు. కోర్టు శిక్ష వేసిందన్న సాకుతో రెండేళ్లపాటు పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకత్వంలో జరిగిన కక్ష సాధింపు చర్య అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆసిఫాబాద్ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను ప్రధాని మోదీ.. క్రోనీ క్యాపిటలిస్టులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల సంపద ప్రజలకే చెందాల్సిన ఈ దేశంలో ప్రధాని మోదీ.. ఆదానీకి దోచి పెడుతుంటే గొంతెత్తి ప్రశ్నించిన రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడానికే బీజేపీ ప్రభుత్వం బహిష్కరణ కుట్రకు పాల్పడిందన్నారు.(Bhatti Vikramarka)

Also Read..Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్

మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ సంపద దోపిడీకి గురవుతుందని పార్లమెంటు లోపల, బయట రాహుల్ గాంధీ గత 9ఏళ్లుగా ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని.. బీజేపీ తప్పుడు విమర్శలు చేసిందన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్నది నిజమేనని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ.. అదానీ ఆర్థిక నేరం గుట్టును రట్టు చేసి.. అదానీ ఈ భారత దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని సైతం మోసం చేశాడని బయటపెట్టింది.

దేశాన్ని దోపిడీ చేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు దేశంలో హిందూ, ముస్లిం విభజన పేరిట ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే కాంగ్రెస్ కలలు కన్న దేశం ఇది కాదంటూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో చేశారని చెప్పారు.

భారత్ జోడో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీకి దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి పెరిగిన ఆదరణతో రానున్న ఎన్నికల్లో ప్రధాని అవుతాడన్న భయంతోనే మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ బహిష్కరిస్తే చూస్తూ ఊరుకోము.(Bhatti Vikramarka)

Also Read..Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దేశ భక్తులమైన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నినదించి కదం తొక్కుతారు. మతం పేరిట దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలని బీజేపీ చూస్తోంది. రాహుల్ గాంధీ పోరాటం మనందరిది. అరచేతిలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దేశ సమైక్యత, సమగ్రత, ఔనత్యం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిర, రాజీవ్ గాంధీలా వారసుడు.. ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు భయపడడని మోడీ గ్రహించాలి. రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడం. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ద్రోహి ఎమ్మెల్యే సక్కుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి” అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.