Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి

Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఇంటి పేరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్‌సభకు అనర్హుడయ్యాడు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) వేశారు. దీంతో ఇప్పటికిప్పుడే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Vallabaneni Vamshi: మా ఎక్స్ బాస్ కొనుగోలు విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రజాక్షేత్రంలో వైసీపీదే విజయం
“కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వాస్తవానికి సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద రాహుల్ గాంధీ ఇప్పటికే పైకోర్టుని ఆశ్రయిస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది. అయితే ఆలోపే లోక్‌సభ సెక్రెటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Opposition March: అదానీని వదలని విపక్షాలు.. హైడ్రామా నడుమ ఢిల్లీలో ఎంపీల ర్యాలీ
దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు మీద చర్యలు తీసుకోవడమేంటని ఆయన మండిపడ్డారు. లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘కోర్టు తీర్పు వెలువడిన 24 గంటలు కూడా కాలేదు. పైగా అప్పీల్ ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. కానీ ఇంత వేగవంతమైన చర్య పట్ల, వారి తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఇది గ్లవ్స్ ఆఫ్ రాజకీయం. మన ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత హానికరమైంది’’ అని ట్వీట్ చేశారు.
I’m stunned by this action and by its rapidity, within 24 hours of the court verdict and while an appeal was known to be in process. This is politics with the gloves off and it bodes ill for our democracy. pic.twitter.com/IhUVHN3b1F
— Shashi Tharoor (@ShashiTharoor) March 24, 2023